కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి రాజీనామా చేస్తే..నేను కూడా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా. ఇద్దరం కలిసి ఎన్నికలకు వెళ్దాం.భాజపా నాకు ఎలాంటి సహకారాలు అందించలేదు. పార్టీలో నేను ఎలాంటి పదవి ఆశించలేదు. ఇప్పుడున్న కమిటీతో రాష్ట్రంలో భాజపా అధికారంలోకి రాదు. ఈ కమిటీతో అధికారంలోకి వస్తే రాజకీయ సన్యాసం చేస్తా.పార్టీని నాశనం చేస్తున్నదెవరో మరోసారి చెబుతా.. దిల్లీ పెద్దలు నాకు తరచూ ఫోన్ చేసి మాట్లాడతారు. నాకు ఎప్పటి నుంచో కేంద్రంలోని పెద్దల ఆశీర్వాదం ఉంది. వాళ్లను కలిసి పార్టీలో జరిగిందంతా చెబుతా. నేను ఎప్పటికీ భాజపా నేతనే. సెక్యులర్ వాదిని కాదు. భారత రాష్ట్ర సమితి, కాంగ్రెస్ పార్టీల్లో చేరను.పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసినందుకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఫోన్ చేసి తిట్టారు. నేను చేసే కామెంట్స్ పార్టీపై కాదు.. కొందరు నేతలపై మాత్రమే. కార్యకర్తలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. దిల్లీ పెద్దలు పిలిస్తే వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నా'' అని రాజా సింగ్ తెలిపారు
భాజపా రాష్ట్ర నాయకత్వంపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మరో సారి విమర్శలు గుప్పించారు
byBLN TELUGU NEWS
-
0
Post a Comment