తెలంగాణలో జెడ్పీ చైర్మన్ రిజర్వేషన్లు ఫిక్స్ !!

42 శాతం బీసీ రిజర్వేషన్ అమలు జీవో జారీ చేయనున్న రాష్ట్ర ప్రభుత్వం
నేడు అన్ని జిల్లాల్లో రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియ, స్థానిక సమరానికి సర్వం సిద్ధం
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్దం అయింది.బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కేటాయిస్తూ ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించింది.ఈ మేరకు జీవో ద్వారా ఖరారు చేయనుంది.రాష్ట్రంలో 31 జెడ్పీ చైర్మన్లు ఉండగా బీసీలకు 13 జిల్లాలు,ఎస్సీలకు 5,ఎస్టీలకు 3,జనరల్ 10 జిల్లాలు రిజర్వ్ కానున్నాయి.
వీటిలో మహిళలకు 50శాతం రిజర్వేషన్లతో 14 జిల్లాలను కేటాయిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేయనుంది.రాష్ట్రంలో జెడ్పీటీసీ స్థానాలు 565 ఉండగా,ఎంపీటీసీ 5,763 స్థానాలు, సర్పంచ్ 12,760 స్థానాలు ఉన్నాయి.కాగా కలెక్టర్లు వీటన్నింటికీ రిజర్వేషన్లు ఖరారు చేసే పనిలో ఉన్నారు.ఖరారు చేసి సమాచారాన్ని గోప్యంగా ఉంచనున్నారు.ప్రభుత్యం అధికారిక ఆదేశాలు వచ్చిన తర్వాతే విడుదల చేస్తారు.అక్టోబర్ నెలలో ఎన్నికలు నిర్వహించనున్నారు.దీపావళి లోపు ఎన్నికల ప్రక్రియ పూర్తి కానుంది.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post