కాంగ్రెస్ -బిఆర్ఎస్ ఇద్దరు దొందు దొందేనరహరిశెట్టి రామకృష్ణబిజెపి మండల అధ్యక్షుడు

 శాయంపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బిజెపి మండల అధ్యక్షుడు నరహరిశెట్టి రామకృష్ణ మాట్లాడుతూ కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీలు ఇద్దరూ ఇసుకభూభకసురులేనాని నియోజకవర్గంలో గతంలో అధికారంలో ఉన్న బిఆర్ఎస్ ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ అక్రమంగా ఇసుక రవాణా చేస్తూ ప్రజాధనాన్ని దోచుకున్నారని అదేవిధంగా మండలంలో కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీలుఒకరిపై ఒకరు భూమి కబ్జా ఆరోపణ చేసుకుంటున్నారని ఈ రెండు పార్టీల చరిత్ర అవినీతి దోపిడేనని ప్రజా సమస్యలు గాలికి వదిలేసారని అక్రమం దోపిడీ వాళ్ల లక్ష్యమని మండలంలో చాలా ప్రజా సమస్యలు ఉన్నప్పటికీ వాటిని విస్మరించి ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ పబ్బం గడుపుతున్నారని అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి మండలంలో ఉన్న యూరియా సమస్య, ఆరు గ్యారెంటీలో భాగంగా మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఇస్తానన్న 2500 రూపాయలు ఇప్పటివరకు ఒక్క కొత్త పెన్షన్ కూడా ఇవ్వకపోవడం చాలా విడ్డురమని ఇదేవిధంగా వీళ్ళ ప్రవర్తన కొనసాగితే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ రాయరాకుల మొగిలి జిల్లా ఉపాధ్యక్షురాలు కోడెపాక స్వరూప, మండల ప్రధాన కార్యదర్శి భూతం తిరుపతి జిల్లా నాయకులు ఉప్పురాజు, కొత్తపెళ్లి శ్రీకాంత్, మంద సురేష్, మండల ఉపాధ్యక్షులు కోమటి రాజశేఖర్, మండల కార్యదర్శి మేకల సుమన్ మండల కోశాధికారి కుక్కల మహేష్ తదితరులు పాల్గొన్నారు

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post