రైతుల ఎదుగుదలకు సమస్యల పరిష్కారంకు ఈ గవర్నమెంట్ సర్వీస్ ను సద్వినియోగం చేసుకోవాలని భూపాలపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు రైతులకు సూచించారు. శాయంపేట మండల కేంద్రంలో ఈ గవర్నమెంట్ సర్వీస్ సేవా కేంద్రం ను ఎమ్మెల్యే జి ఎస్ ఆర్ ప్రారంభిచారు. ఈ కార్యక్రమం కు హన్మకొండ జిల్లా అధికారి సంజవ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ ప్రజా స్వామ్యం లో ప్రజలే అధిపతులు, నాయకులు, యజమానులు కావున రైతులకు కేంద్ర ప్రభుత్వం ఈ గవర్నమెంట్ సర్వీస్ ను పి ఎ సి ఎస్ నుండి రైతులు సద్వినియోగం చేసుకోనే వేసులు భాటు కల్పించిందని తెలియజేసారు. ప్రజలు, రైతులు ఎదుగాలనే సంకల్పం తో కేంద్ర ప్రభుత్వం ఈ గవర్నమెంట్ సర్వీస్ లను ఏర్పాటు చేసిoదని పేర్కొన్నారు. ఎం పి ఓ ల ద్వారా వికాస్ సేవ సెంటర్ లను ఏర్పాటు చేసి చిన్న కారు, సన్న కారు రైతుల అభ్యున్నతికి దొహద పడుతుందాన్నారు. రైతులకు గిట్టుబాటు ధర, మార్కెటింగ్ సౌకర్యం, సదుపాయాలు, నాణ్యమైన విత్తనాలు అందువిధంగా చూస్తుందని తెలిపారు. రైతులు నేరుగా మార్కెటింగ్ చేసుకోను విధంగా వేసులు భాటు వుంటుందాన్నారు. శాయంపేట రైతు సహకార సంఘo రైతు ప్రయోజనాలు ముఖ్యమని రైతు శ్రేయస్సుకు దోహద పాడుతామన్నారు. ఎం పి ఓ ల ద్వారా జనవర్శన, కిసాన్ సేవా కేంద్రాలు ఏర్పాటు తో రైతులు మేనిజ్ మెంట్ కాస్ట్ ద్వారా 6 లక్షల నుండి 15 లక్షల వరకు బోనస్ లబ్ది పొందవచ్చని పేర్కొన్నారు. వేయి రూపాయలు కట్టి రెండు వేయిలు తీసుకోవచ్చని తెలిపారు. మీకు సమస్యలు తెలుసుకొనుటకు సేవా సెంటర్ కు వేలండని సూచించారు.
ఈ గవర్నమెంట్ సర్వీస్ ను సద్వినియోగం చేసుకోండి.... ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
byBLN TELUGU NEWS
-
0
Post a Comment