జర్నలిస్టుల ముసుగులో వసూళ్ల దందా !

 కామారెడ్డిలో బ్లాక్ మెయిల్ విలేకరుల హవా
* లక్షల్లో డబ్బుల డిమాండ్ , బలవంతపు వసూళ్లు
* పోలీస్ స్టేషన్లో కేసులు నమోదైన ఆగని వీరి దందా
* వసూల్ రాజాలా వేధింపులు తాళలేక ఓ మహిళా ఫార్మసిస్ట్ ఆత్మహత్య
* వ్యాపారులను , అధికారులను సైతం బ్లాక్ మెయిల్ చేస్తున్న వైనం
* ఆర్టిఐ చట్టాన్ని ఆయుధంగా చేసుకొని దందా నడుపుతున్న వసూల్ రాజాలు!
* కలం వాడని కంత్రిలు
హైదరాబాద్ : కామారెడ్డిలో జర్నలిజం ముసుగులో కొందరు వ్యక్తులు పలువురు వ్యాపారులు , అధికారులను , ఉద్యోగులను, అమాయకులను బ్లాక్ మెయిల్ చేస్తూ లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నారు .కాసుల వేటలో పడి కొందరు వ్యక్తులు జర్నలిజం ముసుగులో అక్రమ దందాలు చేస్తూ జర్నలిజం వృత్తికే కళంకం తెస్తున్నారు . సమాజంలో ప్రభుత్వానికి, అధికారులకు, ప్రజలకు మధ్య వారధిగా ఉండి, అవినీతి, అక్రమాలు బయట పెట్టేందుకు, మంచిని సైతం సమాజానికి తెలిపేందుకు జర్నలిస్టు వృత్తిగా కలాన్ని వాడాల్సిన వీరు కలం వాడకుండా ముఠా గా ఏర్పడి కంత్రిలుగా మారి డబ్బుల వసూళ్ల కోసం విలేకరుల ముసుగు వేసుకుని తిరుగుతున్నారు. పలువురు అధికారులు , ఉద్యోగులు , వ్యాపారులే కాకుండా అంబేద్కర్ సంఘం నాయకులను కూడా బ్లాక్ మెయిల్ చేస్తూ బలవంతంగా డబ్బులు వసూలు చేస్తున్నారు .మాచారెడ్డి మండలంలో ఓ పేద దళితుడు ఆర్థిక ఇబ్బందులతో తన భూమిని అమ్ముకుంటే నిబంధనలు విరుద్ధంగా విక్రయించావని ఈ ముఠా జర్నలిస్టు లు పాపం ఆ దళితుడిని 5 లక్షలు ఇవ్వాలని బెదిరించాడు. వీరి వేధింపులు తాళలేక అతను అంబేద్కర్ సంఘాలను ఆశ్రయించడంతో జిల్లా కేంద్రంలో వాళ్ళ దిష్టిబొమ్మలు దహనానికి పిలుపునిచ్చారు. ఈ విషయం తెలుసుకున్న ఆ దొంగ జర్నలిస్టులు కాళ్లభేరానికి దిగి వచ్చారు. ఆ దళితుడి కాళ్ళు మొక్కి మళ్ళీ ఇలాంటి పనులు చేయమని బయటపడ్డారు. జర్నలిజం ముసుగులో వసూళ్ల దందా నడుపుతున్న ముఠాకు చుక్కాపూర్ గ్రామానికి చెందిన ఇందూరి సిద్ధ గౌడ్ అనే వ్యక్తి నాయకుడు . గాంధారి మండలం వడ్డేపల్లి కి చెందిన కాట్యాడ బాబురావు అనే వ్యక్తి ఇతనికి ప్రధాన అనుచరుడు . ప్రధాన పత్రికలో పనిచేస్తున్న, సిద్ధా గౌడ్ కు బంధువైన ఓ జర్నలిస్టు వీరికి సహకరిస్తున్నాడు. 
ప్రతిరోజు ఈ ముఠా సభ్యులు కామారెడ్డి కలెక్టరేట్లో మకాం వేసి ఆర్టిఐ చట్టం క్రింద దరఖాస్తులు చేయడం , వ్యాపారుల చిన్నచిన్న లొసుకులను బయటకు లాగడం , వారి నుంచి లక్షలాది రూపాయల డిమాండ్ చేస్తూ వసూలు చేయడం సిద్దా గౌడ్ ముఠా స్పెషాలిటీ ! ఒకవైపు మెడికల్ షాప్ నడుపుతూ మరోవైపు ప్రభుత్వ ఉద్యోగం నువ్వు చేస్తున్నామంటూ లక్షల రూపాయలు ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తూ ఒక మహిళను వేధించడంతో వీరి వేధింపులు తట్టుకోలేక సదరు మహిళ ఫార్మసిస్టు ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం .
జిల్లా కేంద్రంలోని పలు ప్రైవేట్ స్కూల్ లకు నిబంధనలు లేవంటూ యజమాన్యాన్ని బెదిరింపులకు పాల్పడ్డారు. పట్టణంలోని, విద్యానగర్ కాలనీ, మాచారెడ్డి, రాజంపేట, బాన్సువాడ లో స్కూల్ ల నిబంధనలు లేవంటూ యాజమాన్యాలను బెదిరించి లక్షల్లో డబ్బులను డిమాండ్ చేస్తున్నారు. వార్తలు రాస్తామని, సోషల్ మీడియాలో ప్రచారం చేసి పరువు తీస్తామని వారిని వేధింపులకు పాల్పడ్డ ఘటనలు ఉన్నాయి. 
విద్యా , వైద్యం , ఎక్సైజ్, బీసీ, ఎస్సి , ఎస్టి , సంక్షేమ శాఖలు, ఉపాధి కల్పన, వ్యవసాయ, మున్సిపల్ తదితర శాఖల్లో వీరు సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేయడమే నిత్యం పనిగా పెట్టుకుంటారు. సమాచారం ఇవ్వకుంటే బెదిరింపులకు పాల్పడతారు. వివరాలు తీసుకొని వాటిలో చిన్న పాటి లొసుగును పట్టుకొని అధికారులను, ఉద్యోగులను సస్పెండ్ చేయిస్తామని బెదిరిస్తారు. లక్ష నుంచి ఐదు లక్షల వరకు డబ్బులు డిమాండ్ చేస్తారు. ఇలాంటి ఘటనే ఆత్మహత్య చేసుకున్న మహిళా ఉద్యోగి దీనగాద కూడా అదే. సహా చట్టం కింద వైద్యశాఖలో వివరాలు తీసుకొని ఆమెను డబ్బుల కోసం మనోవేదనకు గురి చేస్తేనే ఆత్మహత్య చేసుకుందనే ఆ శాఖలో కోడైకుస్తున్నారు. 
వీరీ ఆగడాలు చూడలేక, బెదిరింపులు తట్టుకోలేక టీఎన్జీవోస్ ఉద్యోగుల సైతం ఏకమైన సందర్భాలు ఉన్నాయి. స్వయంగా జిల్లా కలెక్టర్ ముందు వీరి బాగోతాలను వెల్లిబుచ్చుకున్నారు. జర్నలిస్టుల ముసుగులో ఉన్న ఈ దొంగ ముఠా సభ్యుల కోసం జర్నలిస్టు వ్యవస్థని తప్పు పట్టడం సరికాదని ఉద్యోగ సంఘాలు వెనకడుగు వేయాల్సి వచ్చింది. 
 వీరిపై పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు అయినట్లు సమాచారం .అయినా ఈ ముఠాపై చర్యలు తీసుకునే నాథుడే కరువయ్యాడు . 
ఇందూరి సిద్ధ గౌడ్ , కే బాపూ రావులపై చర్యలు తీసుకోవాలంటూ , వారి అక్రిడిటేషన్ కార్డులు ప్రభుత్వం రద్దు చేయాలంటూ తెలంగాణ స్టేట్ అంబేద్కర్ యువజన సంఘం నాయకులు చావు డప్పులతో నిరసన తెలుప్తుమని చలో వజపల్లి కి పిలుపు నిచ్చారు...
జర్నలిజం ముసుగులో వసూళ్లకు పాల్పడుతున్న సిద్దా గౌడ్ , బాపూ రావులపై చర్యలు తీసుకోవాలని పలువురు వ్యాపారులు , ప్రజా సంఘాల నేతలు , బాధితులు కోరుతున్నారు .

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post