పరకాల పట్టణంలోని అమరవీరుల మైదానం అమరధామంలో స్వాతంత్ర్య పోరాటంలో ప్రాణాలు అర్పించిన అమరవీరులకు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమాన్ని బీజేపీ పరకాల పట్టణ అధ్యక్షులు గాజుల నిరంజన్ ఆధ్వర్యంలో నిర్వహించారు.
ముఖ్య అతిథులుగా విచ్చేసిన బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు కొలను సంతోష్ రెడ్డి, పరకాల నియోజకవర్గ కాంటెస్టెంట్ ఎమ్మెల్యే డాక్టర్ పగడాల కాళీ ప్రసాద్ రావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ పెసరు విజయచందర్ రెడ్డి తదితరులు అమరులకు నివాళులర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం ఎన్నోమంది తమ ప్రాణాలను త్యాగం చేశారని గుర్తు చేశారు. 1947 ఆగస్టు 15న దేశం స్వాతంత్ర్యం పొందినప్పటికీ, నిజాం నవాబు తెలంగాణను భారత్‌లో విలీనం చేయకుండా రజాకర్ల అణచివేత పాలన కొనసాగించాడని పేర్కొన్నారు. రజాకర్ల ఆగడాలను తట్టుకోలేక ఈ ప్రాంత ప్రజలు వందలాదిగా సమరానికి దిగారని, పరకాల అమరవీరుల మైదానం చాపల బండ కాడికి చేరుకున్నప్పుడు జరిగిన కాల్పుల్లో అనేకమంది అమరులయ్యారని చెప్పారు. రంగాపురం గ్రామంలో ప్రజలను చింతచెట్లకు కట్టి కాల్చివేసిన ఘోర సంఘటనలను గుర్తుచేశారు.
నాటి అమరుల సాహసగాథలను పాఠ్యపుస్తకాలలో చేర్చాలని, భవిష్యత్ తరాలకు చరిత్రను అందించాలని ప్రేమేందర్ రెడ్డి డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు కాచం గురుప్రసాద్, గుజ్జ సత్యనారాయణరావు, దేవునూరి మేఘనాథ్, పట్టణ ప్రధాన కార్యదర్శి సంగా పురుషోత్తం, మండల అధ్యక్షులు, నాయకులు కాసగాని రాజ్‌కుమార్, బెజ్జంకి పూర్ణచారి, దగ్గు విజేందర్ రావు, ఎర్రం రామన్న, మార్త రాజభద్రయ్య, కుక్కల విజయ్‌కుమార్, మార్త బిక్షపతి, నాగేల్లి రంజిత్, మారేడుగొండ భాస్కర్ చారి, వెనిశెట్టి శారద, పల్లెబోయిన రామన్న, ఆకుల శ్రీధర్, ముత్యాల దేవేందర్, పిట్ట కిషోర్, సారంగా నరేష్, ఉడుత చిరంజీవి, కాగితపు చంద్రమోహన్, దుబాసి కృష్ణప్రసాద్, ఆకుల రాంబాబు, కానుగుల గోపీనాథ్, కోడెల లింగమూర్తి, కక్కు రాజు, పల్లెబోయిన భద్రయ్య, ఏకు కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Post a Comment