తీరు మారని నీ రాత ప్రజలే రాస్తారు..

నిధులు తెచ్చే దమ్ము లేక ప్రజలను శిలాఫలకలు వేసి ఏమార్చుతున్నావ్..
మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి
శాయంపేట మండలం, కొప్పుల గ్రామంలో బిఆర్ఎస్ ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఒప్పించి నేను కొప్పుల గ్రామం నుండి పరకాల నేషనల్ హైవే మధ్యన చలివాగు పై బ్రిడ్జి నిర్మాణం కొరకు STSDF 2023-24 నుండి రూ.574 లక్షలు మరియు కొప్పుల గ్రామం నుండి పరకాల వరకు బిటీ రోడ్డు నిర్మాణం కొరకు రూ.585 లక్షలు మంజూరు చేయించి, టెండర్లు పిలిచి, పనులు ప్రారంభించడం జరిగింది.జరుగుతున్న పనులను ఆపివేసిన ప్రస్తుత ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు నిస్సిగ్గుగా నేను నిధులు తెచ్చిన అంటూ
మేము వేసిన శిలాఫలకాల పక్కనే శిలాఫలకాలు వేసి ప్రజలను ఏమార్చే ప్రయత్నం చేయడం ఏంటని ఏద్దేవా చేసిన భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి 
ఈ రోజు శాయంపేట మండలంలో పర్యటించిన భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి 
ఈ సందర్భంగా జోగంపల్లి గ్రామం నుండి మైలారం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ...
నేను ఎమ్మెల్యే గా ఉన్నప్పుడు హుస్సేన్ పల్లి నుండి మైలారం వరకు వయా పెద్ద చెరువు కట్ట మీదుగా కోటి అరవై లక్షల రూపాయలతో రోడ్డు నిర్మాణ పనులకు నిధులు మంజూరు చేసి, పనులు ప్రారంభించడం జరిగింది.
కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇష్టరాజ్యంగా పనులు చేస్తున్నారు.
కాంగ్రెస్ నాయకుల వ్యవసాయ భూమి ఉందని రోడ్డు పక్కన ఉన్న చెరువుని ఆక్రమిస్తూ రోడ్డు వేస్తున్నారు.
కాంగ్రెస్ నాయకులకు సహకరించని అధికారులను ట్రాన్స్ఫర్ చేయిస్తూ వారిపై కక్ష్య సాధింపు చర్యలు చేస్తున్నారు.
అదే విదంగా ఎస్సిలకి సంబంధించిన స్మశాన వాటికను కూడా ఆక్రమించుకున్నారు.
అంటే అధికార పార్టీ నాయకులు ఏదీ చేసిన మాఫ్ అనే ధోరణి నడుస్తుంది.
కావున ఇరిగేషన్ అధికారులు మరియు రెవెన్యూ అధికారులు సమన్వయంతో పనిచేయాలని చెరువును ఆక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అనంతరం కొప్పుల గ్రామంలో వేసిన శిలా ఫలకాలను చూసి శిలాఫలకాల మోజులో ప్రజలను ఏమార్చుతున్నారు అంటూ చురకలు అంటించాడు.
వారి వెంట శాయంపేట మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post