పల్లెల్లో అభివృద్ధి పనులను మరింత వేగవంతం చేయడానికే పనుల జాతర కార్యక్రమాలు
- భూపాలపల్లి పల్లెల్లో పండుగ వాతావరణంలో పనుల జాతర కార్యక్రమాలు..
- పల్లెల్లో ప్రజల అభ్యున్నతికి ప్రజా ప్రభుత్వం విస్తృతంగా అభివృద్ధి పనులు చేస్తోందన్న ఎమ్మెల్యే జీఎస్సార్.. ప్రతీ ఇంటికి మౌలిక వసతులు అందించడమే సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వ ధ్యేయమన్న ఎమ్మెల్యే..
- అభివృద్ధి పనులు పారదర్శకంగా, నాణ్యతతో త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులు, కాంట్రాక్టర్లకు ఎమ్మెల్యే సూచన..
- గడిపల్లి, వెంకట్రావుపల్లి(సీ), చిట్యాల, మందలోరిపల్లి, జడల్ పేట, దూత్ పల్లి గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసిన ఎమ్మెల్యే జీఎస్సార్..
రేగొండ/చిట్యాల/టేకుమట్ల మండలాలు:
పల్లెల్లో అభివృద్ధి పనులను మరింత వేగవంతం చేయడానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ - తెలంగాణ ఆధ్వర్యంలో పల్లెల్లో పనుల జాతర కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. ఈరోజు శుక్రవారం రోజు భూపాలపల్లి నియోజకవర్గంలోని రేగొండ, చిట్యాల, టేకుమట్ల మండలాల్లోని వివిధ గ్రామాల్లో నిర్వహించిన పనుల జాతర కార్యక్రమాలల్లో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా రేగొండ మండలం గడిపల్లి గ్రామంలో రూ.12 లక్షలతో నూతనంగా నిర్మించనున్న అంగన్వాడీ బిల్డింగ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి, పోచమ్మ ఆలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం చిట్యాల మండలం వెంకట్రావుపల్లి(సీ) గ్రామంలో రూ.5 లక్షలతో నూతనంగా నిర్మించనున్న ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. అదేవిధంగా, చిట్యాల మండల కేంద్రంలో రూ.40 లక్షలతో నూతనంగా నిర్మించనున్న ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్ నిర్మాణ పనులు మరియు రూ.3 లక్షలతో కమ్యూనిటీ టాయిలెట్స్ నిర్మాణ పనులకు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి శంకుస్థాపనలు చేశారు. టేకుమట్ల మండలం మందలోరిపల్లి గ్రామంలో రూ.20 లక్షలతో నూతనంగా నిర్మించిన జీపీ బిల్డింగ్ ను కలెక్టర్ తో కలిసి ప్రారంభించారు. అనంతరం జీపీ ప్రాంగాణంలో కలెక్టర్ తో కలిసి ఎమ్మెల్యే మొక్కలను నాటి నీరు పోశారు. ఆ గ్రామ పంచాయతీ సెక్రటరీ, స్పెషల్ ఆఫీసర్ కు ఎమ్మెల్యే శాలువా కప్పి, పూల బొకే ఇచ్చి అభినందించారు. చిట్యాల మండలం జడల్పేట గ్రామంలో రూ.12 లక్షలతో నూతనంగా నిర్మించనున్న అంగన్వాడీ భవన నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. చిట్యాల మండలం దూత్ పల్లి గ్రామంలో రూ.10 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఆయా గ్రామాలల్లో కమ్యూనిటీ సోక్ పిట్ లకు సంబంధించిన మంజూరీ పత్రాలను అందజేశారు. మల్టీ పర్పస్ సిబ్బందికి ఎమ్మెల్యే శాలువా కప్పి సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాలల్లో ఎమ్మెల్యే మాట్లాడుతూ... పల్లెల్లో ప్రజల అభ్యున్నతికి ప్రజా ప్రభుత్వం విస్తృతంగా అభివృద్ధి పనులు చేస్తోందని ఎమ్మెల్యే అన్నారు. ప్రతీ ఇంటికి మౌలిక వసతులు అందించడమే సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే అన్నారు. పల్లెల సమగ్రాభివృద్ధికి ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. గత పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ గ్రామాలను నిర్వీర్యం చేసిందన్నారు. గ్రామీణ ప్రాంతాలకు నిధులు కేటాయించకుండా వివక్ష చూపించడంతో చాలా గ్రామాలు అభివృద్ధికి నోచుకోలేదని ఎమ్మెల్యే ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వంలో ప్రతి గ్రామానికి ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమాలల్లో ఎమ్మెల్యే వెంట పలువురు ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ నేతలు, అధికారులు, కార్యకర్తలు, గ్రామస్తులు ఉన్నారు
Post a Comment