ఘనంగా పనుల జాతర కార్యక్రమం

శాయంపేటలో ఘనంగా పనుల జాతర కార్యక్రమం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే జీఎస్సార్..
యంజేపీ స్కూల్ లో సీసీ రోడ్డు ప్రారంభోత్సవం.. వనమహోత్సవంలో పాల్గొని మొక్కలు నాటిన ఎమ్మెల్యే..
- పల్లెల సమగ్రాభివృద్ధికి ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోందన్న ఎమ్మెల్యే..

శాయంపేట, 23 ఆగస్టు 2025:
తెలంగాణ ప్రజా ప్రభుత్వం రాష్ట్రంలో ఈరోజు(శుక్రవారం) పనుల జాతర కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తోంది. అందులో భాగంగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు నియోజకవర్గంలోని శాయంపేట మండలంలో జరిగిన పనుల జాతరలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మండలంలోని యంజేపీ(బాలురు) పాఠశాలలో నరేగా నిధులు రూ.20 లక్షలతో కొత్తగా నిర్మించిన సీసీ రోడ్డును ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం వనమహోత్సవంలో పాల్గొని మొక్కలు నాటి నీరు పోశారు. ఎమ్మెల్యేకు పత్తిపాక గ్రామానికి చెందిన యంజేపీ స్కూల్ విద్యార్ది జగన్(8వ తరగతి) తాను తయారుచేసిన హ్యాండ్ క్రాఫ్ట్ ను ఎమ్మెల్యే కు అందజేశాడు. అనంతరం గ్రామ పంచాయతీ ఆవరణలో స్వచ్ఛ భారత్ మిషన్ నిధులు రూ.3 లక్షలతో కమ్యూనిటీ టాయిలెట్స్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పల్లెల సమగ్రాభివృద్ధికి ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. గత పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ గ్రామాలను నిర్వీర్యం చేసిందన్నారు. గ్రామీణ ప్రాంతాలకు నిధులు కేటాయించకుండా వివక్ష చూపించడంతో చాలా గ్రామాలు అభివృద్ధికి నోచుకోలేదని ఎమ్మెల్యే ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వంలో ప్రతి గ్రామానికి ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట పలువురు కాంగ్రెస్ నేతలు, అధికారులు, కార్యకర్తలు, గ్రామస్తులు ఉన్నారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post