జేబులో కత్తెర పెట్టుకుని తిరుగుతున్న సీఎం రేవంత్ రెడ్డి.మాజీమంత్రి హరీష్ రావు

తెలంగాణ ఉద్యమ సమయంలో సీఎం రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో ఉన్నాడని మాజీమంత్రి హరీష్ రావు గుర్తు చేశారు.* ఆ సమయంలో *రేవంత్ రెడ్డి .. ఓయూకి వస్తే విద్యార్థులు ఇయ్యర మయ్యర అందుకున్నారని* వివరించారు. *అప్పుడు సందులో పడి రేవంత్ రెడ్డి ఉరికాడని* చెప్పారు. కానీ ఇప్పుడు.. తాను ఓయూకు వచ్చానని అంటున్నాడన్నారు. *విద్యార్థులకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ఓయూ సాక్షిగా క్షమాపణలు చెప్పాలంటూ* సీఎం రేవంత్ రెడ్డిని ఆయన డిమాండ్ చేశారు.
 *ఎప్పటిలోగా విద్యార్థులకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తావో చెప్పాలని* సీఎం రేవంత్ రెడ్డికి సూచించారు. *ఓయూకు వెళ్తున్నాడని గత మూడు రోజుల నుంచి విద్యార్థులను అరెస్టులు చేయించారని* మండిపడ్డారు. వారిని పోలీసు స్టేషన్లలో పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. *గజానికో పోలీసుని పెట్టారంటూ ప్రభుత్వంపై ఆగ్రహం* వ్యక్తం చేశారు. *బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఓయూలో మంత్రి సబిత కొబ్బరికాయ కొట్టిన బిల్డింగ్‌ను ప్రారంభించేందుకు సీఎం రేవంత్ వెళ్లారనిఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ నిర్మించిన దానికి రేవంత్ రెడ్డి రిబ్బన్ కత్తిరించాడనిఎద్దేవా చేశారు.కత్తెర జేబుల పెట్టుకొని తిరుగుతున్నాడంటూసీఎం రేవంత్ రెడ్డిని వ్యంగ్యంగా విమర్శించారు. హైదరాబాద్ ఫ్లైఓవర్లు కేసీఆర్ కట్టించినివేనని.. వాటికి రిబ్బన్ కట్ చేసేందుకే వెళ్తాడంటూ* ఆయన వ్యంగ్యంగా అన్నారు. బీఆర్ఎస్ హయాంలో కట్టినవి ఓపెన్ చేయడమే కానీ..కొత్తగా ఒక్క దవాఖాన కూడా నిర్మించలేదన్నారుఒక బ్రిడ్జి కానీ.. ఒక బిల్డింగ్ కానీ కట్టలేదనిమండిపడ్డారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post