శాయంపేట మండల కేంద్రంలో బస్టాండ్ ఆవరణంలో ఉన్నటువంటి మరుగుదొడ్లు సౌకర్యవంతంగా లేకపోవడం వలన బస్ స్టాండ్ ఆవరణంలో బహిరంగ మల మూత్ర విసర్జన చేయడం మూలంగా దుర్వాసన తో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని బహుజన సంక్షేమ సంఘం (బి ఎస్ ఎస్) ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు మొగ్గం సుమన్ అన్నారు. బస్టాండ్ ఆవరణంలో మరుగుదొడ్లు కట్టినప్పటినుండి ఇప్పటివరకు అసౌకర్యవంతంగానే మిగిలిపోయాయని ఈ బస్టాండ్ ఆవరణంలో చెత్తాచెదారం వ్యర్ధాలు వేయడం మూలంగా దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ఈ మరుగుదొడ్లు నిరుపయోగంగా, సౌకర్యవంతంగా లేకపోవడం వలన శాయంపేట మండల కేంద్రంలో ప్రతి శనివారం జరిగే సంత కు వచ్చే ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. వర్షాలు తీవ్రంగా పడటం మూలంగా బస్టాండు చుట్టుప్రక్కల ప్రదేశాలు వ్యర్ధాలతో నిండి అస్తవ్యస్తంగా తయారయ్యాయని అన్నారు. అధికారులు ప్రజా ప్రతినిధులు ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
బస్ స్టాండ్ ఆవరణంలో బహిరంగ మల మూత్ర విసర్జన చేయడం
byBLN TELUGU NEWS
-
0
Post a Comment