కల్వకుర్తి నియోజకవర్గం తలకొండపల్లి మండల రెవెన్యూ అధికారి (MRO) కాసేపటి క్రితం ఏసీబీకి చిక్కారు ...గత కొన్ని నెలలుగా వరుస కథనాలు ఎమ్మార్వో కార్యాలయం పైన ,ఎమ్మార్వో పైన వస్తున్న నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించిన రెవెన్యూ జిల్లా యంత్రాంగం...
ఈరోజు అంతారం గ్రామానికి చెందిన రైతు పొలం తన పొలం మార్పు చేయడం కోసం ఒక లక్ష 50 వేలకు డబ్బులకు మాట్లాడుకుని ఈరోజు పదివేల రూపాయలు తీసుకుంటూ అడ్డంగా బుక్కైన ఎమ్మార్వో... ఒక్కో పనికి ఒక్కో ధర నిర్ణయించి గత కొద్ది కాలంగా తలకొండపల్లి మండల పేద రైతులను పీడిస్తూ డబ్బులు వసూలు చేసిన MRO తిమింగలం... బడా బాబులకు ఒక లెక్క... పేదలకు మరో లెక్క...
డబ్బులు ఇస్తేనే ఫైల్ ముందలికి కదిలే వ్యస్థను తయారు చేసి ఎమ్మార్వో కార్యాలయం అంటేనే రైతులు బెంబేలెత్తే పరిస్థితికి తలకొండపల్లి తాసిల్దార్ కార్యాలయం తీసుకువచ్చిన వైనం...
రెవెన్యూ వ్యవస్థనే నాశనం చేసిన బూకాసురుడు ఎమ్మార్వో...
ఈరోజు MRO ఏసీబీకి పట్టు పడడం రైతులు అందరూ హర్షం వ్యక్తం చేయడంతో పాటు ఎమ్మార్వో ఏసీబీకి పట్టు పడడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు....
Post a Comment