శాయంపేట మండలంలోని రాజు పల్లి గ్రామ వ్యవసాయ భూములకు వెళ్లే దారిని అదే గ్రామానికి చెందినగొలుసుల దేవేందర్ ధ్వంసం చేసినట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గత 50 ఏళ్లుగా 120 ఎకరాలకు పైగా వ్యవసాయ భూములకు వెళ్లే దారినీధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించిన రాజుపల్లి రైతులు
జెసిబి తో దారి అడ్డంగా ఉన్న సిమెంట్ పైపును తొలగించి దారి లేదని ఇబ్బందులకు గురి చేస్తున్నాడని అన్నారు. గ్రామానికి చెందిన 28 మంది రైతులు సొంత ఖర్చుతో గత 4 రోజుల క్రితం మొరం పోసి చదును చేసి సిమెంట్ పైపు వేస్తే వ్యవసాయ భూములకు వెళ్లే దారికి అడ్డంగా జెసిబి తో పెద్ద గొయ్యి తీసి ఇది మాభూమి ఎవరు నడవద్దని ఇబ్బందులకు గురి చేస్తున్నాడని రైతులు వాపోయారు. ఏళ్ల తరబడి వ్యవసాయ భూములకు వెళ్లే దారిని రైతులు ఉపయోగించుకుంటున్నారని కానీ దారిని ఆక్రమించేందుకే దారిని ధ్వంసం చేశాడని అన్నారు. వ్యవసాయ భూములకు వెళ్లే దారిని ధ్వంసం చేసిన దేవేందర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాజు పల్లి గ్రామానికి చెందిన రైతులు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశామన్నారు. స్థానిక ఎస్పై పరమేశ్వర్ వ్యవసాయ భూములకు వెళ్లే దారిని సందర్శించి రైతులతో మాట్లాడి తగిన న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.
Post a Comment