పరకాల మండలం నాగారం గ్రామంలో ఇటీవలే మృతిచెందిన బొమ్మరాజు రాజమ్మ కుటుంబాన్ని పరకాల మాజీ శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి పరామర్శించారు.ఈ సందర్భంగా మృతురాలు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.అనంతరం ఆమె మృతికి గల కారణాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు.అదేవిధంగా కొద్దిరోజులుగా అనారోగ్యంతో భాదపడుతున్న మల్లక్కపేట గ్రామానికి చెందిన బిఆర్ఎస్ అధ్యక్షులు బొజ్జమ్ రవి తండ్రి సారయ్య మాజీ ఎమ్మెల్యే పరామర్శించారు.
పరకాల పట్టణానికి చెందిన బిఆర్ఎస్ నాయకులు మాజీ ఎంపిటిసి,కౌన్సిలర్ చందుపట్ల తిరుపతి రెడ్డి గారి తల్లి చందుపట్ల రాధమ్మ గారి ప్రధమ వర్దంతిలో పాల్గొని ఆమె చిత్రపటానికి పూలవేసి నివాళులు అర్పించారు.
Post a Comment