బీసీ బాలికల హాస్టల్ కు వాటర్ ఫిల్టర్ బహుకరణ.

హనుమకొండ జిల్లాశాయంపేట మండల కేంద్రంలోని వెనుకబడిన తరగతుల బాలికల హాస్టల్ కు శాయంపేటకు చెందిన క్రీస్తు శేషులు బాసని శంకరయ్య జ్ఞాపకార్థం ఆయన కుమారులు వినయ భూషణ్ శైలేష్ కుమార్ వాటర్ ఫిల్టర్ ను బహుకరించారు. ఈ మేరకు శంకరయ్య సోదరుడు భాసని సుబ్రహ్మణ్యం మంగళవారం హాస్టల్ కు వెళ్లి 25 వేల విలువగల వాటర్ ఫిల్టర్ ను హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ సుష్మాకు అందజేసి ఫిట్టింగ్ చేయించి హాస్టల్ బాలికలకు పరిశుభ్రమైన తాగునీరు కోసం చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా హాస్టల్ బాలికలు వారికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో శ్రీ మత్స్యగిరి స్వామి దేవాలయ చైర్మన్ సామల బిక్షపతి హాస్టల్ సిబ్బంది పాల్గొన్నారు
...

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post