చనిపోయాడనుకున్న కుమారస్వామి బ్రతికే ఉన్నాడువరంగల్ జిల్లా పాలకుర్తి మండలం మైలారం గ్రామానికి చెందిన గోక కుమారస్వామి(50), రమ దంపతులు విభేదాలతో 20 ఏళ్ల కిందట విడిపోయారురమ మైలారంలో ఉంటుండగా.. కుమారస్వామి తొర్రూరు పట్టణంలో ఉంటూ భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్నాడు.
మూడు రోజుల కిందట తొర్రూరు బజాజ్ షోరూం సమీపంలో అపస్మారక స్థితిలో ఉన్న ఓ వ్యక్తిని ఎంజీఎం ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ నిన్న మృతి చెందాడు.. ఇతనే కుమారస్వామి అనుకోని కుటుంబసభ్యులకు సమాచారమిచ్చారు.
మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లిన కుటుంబసభ్యులు, కుమారస్వామి చేతిపై శ్రీ అనే పచ్చబొట్టు ఉండేది, మృతదేహంపై లేకపోవడాన్ని గమనించారు.చివరికి మృతదేహం వేరే వ్యక్తిది అని గుర్తించి, నిన్న తిరిగి ఎంజీఎం ఆసుపత్రికి తీసుకెళ్లగా, సిబ్బంది రేపు రమ్మని పంపించారు.
ఈరోజు కుటుంబసభ్యులు వెళ్లగా కుమారస్వామి బ్రతికే ఉన్నాడని, ఐడీ వార్డులో చికిత్స పొందుతున్నాడని సిబ్బంది తెలపడంతో సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు.
Post a Comment