ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో రెండో రోజు ఆట ముగిసింది.

 ఓవర్‌నైట్‌ స్కోర్‌ 310/5 రెండో రోజు బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 587 పరుగులకు ఆలౌట్‌ అయింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన ఇంగ్లాండ్ ఆట ముగిసే సరికి 3 వికెట్లు కోల్పోయి 77 పరుగులు చేసింది. రెండో టెస్ తొలి ఇన్నింగ్స్లో భారత్ భారీ స్కోరు చేసింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ డబుల్ సెంచరీతో అలరించాడు. 387 బంతుల్లో 269 పరుగులు చేశాడు. ఓవర్‌ నైట్ స్కోరు 41తో క్రీజులోకి వచ్చిన రవీంద్ర జడేజా 137 బంతుల్లో 89 పరుగులకే ఔట్ అయ్యాడు. సెంచరీ చేసే ఛాన్స్‌ను మిస్‌ చేసుకున్నాడు. వాషింగ్టన్ సుందర్ 103 బంతుల్లో 42 పరుగులతో రాణించాడు. గిల్, జడేజా ఆరో వికెట్‌కు 203 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. గిల్, సుందర్ జోడీ ఏడో వికెట్‌కు 144 పరుగులు (189 బంతుల్లో) జోడించింది. తొలి రోజే యశస్వి జైస్వాల్ 87 పరుగులతో అదరగొట్టాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో షోయబ్ బషీర్ 3, క్రిస్ వోక్స్ 2, జోష్ టంగ్ 2, బ్రైడన్ కార్స్, బెన్ స్టోక్స్, జో రూట్ ఒక్కో వికెట్ పడగొట్టారు.
ఇంగ్లాండ్కు ఆరంభంలో గట్టి ఎదురదెబ్బ తగిలింది. బెన్ డకెట్ (0), ఓలీ పోప్ (0)లను ఆకాశ్‌ దీప్ వరుస బంతుల్లో పెవిలియన్‌ పంపించాడు. ఆ తర్వాత వచ్చిన జాక్ క్రాలీ 19 పరుగులకే ఔట్ అయ్యాడు. క్రాలీని సిరాజ్‌ ఔట్ చేశాడు. ఈ క్రమంలో జో రూట్, హ్యారీ బ్రూక్ నిలకడగా ఆడి మరో వికెట్ పడకుండా చూసుకున్నారు. ప్రస్తుతం రూట్ 37 బంతుల్లో 18 పరగులు, హ్యారీ బుక్ 53 బంతుల్లో 30 పరుగుల చేసి క్రీజులో ఉన్నారు. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో ఇంకా 510 పరుగుల వెనుకంజలో ఉంది. ఇక భారమంతా భారత్ బౌలర్లపైనే ఉంది. వీలైనంత తక్కువ స్కోరుకు ఇంగ్లాండ్ను ఆలౌట్ చేస్తేనే మ్యాచ్‌పై భారత్ పట్టు బిగించే అవకాశముంది.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post