గోరికొత్తపల్లి మండల బిఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం...రోడ్డుపై బైఠాయించిన భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే,బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి....

గోరికొత్తపల్లి మండలం,భూపాలపల్లి నియోజకవర్గం.
కేసీఆర్ రైతుబంధు అంటే నాట్లు వేసే కాలమని, రేవంత్ రెడ్డి రైతు భరోసా అంటే ఎలక్షన్ కాలమని ఎద్దేవా చేసిన భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి తన మన బేధం లేకుండా అందరూ తెలంగాణ బిడ్డలేనని అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరికి ఇచ్చిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని వరంగల్ జిల్లా జడ్పీ మాజీ ఛైర్పర్సన్ & భూపాలపల్లి జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి అన్నారు.ఈ రోజు గోరికొత్తపల్లి మండల కేంద్రంలో మండల పార్టీ అధ్యక్షుడు హమీద్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశం మరియు కొత్తగా ఏర్పడిన మండలంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పోలీస్ స్టేషన్, కస్తూర్బా గాంధీ పాఠశాల, మహాత్మా జ్యోతి రావు పూలే బాల & బాలికల రెసిడెన్షియల్ స్కూల్,ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రం,ఎరువుల కొరత లేకుండా చూడాలని,అదే విధంగా సర్వే నంబర్ 391,821,1652,1653 లోని భూములకు పట్టాలను ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పోరాడుదాం సాధిద్దాం కార్యక్రమానికి  పాల్గొన్న భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి  మరియు వరంగల్ జిల్లా జడ్పీ మాజీ ఛైర్పర్సన్ & భూపాలపల్లి జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి  మండలములోని అన్ని గ్రామాల ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు స్థానిక మహిళలు పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్  ఒప్పించి నియోజకవర్గంలోనే పెద్ద మండలం రేగొండ మండలమని దీని రెండు మండలాలుగా చేస్తే ప్రజలకు పరిపాలన పరమైన ఇబ్బంది రాదని చెప్పి తేది:28/06/2023 న గోరికొత్తపల్లి మండలని ఏర్పాటు చేస్తూ G.O తీసుకురావడం జరిగింది.
మండలం ఏర్పడిన తర్వాత మండల MRO ఆఫీస్,MPDO ఆఫీసు లకు నిధులను మంజూరు చేసి పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది.
ఈ సందర్భంగా రెవెన్యూ మంత్రి శ్రీనివాస్ రెడ్డి , స్థానిక జిల్లా మంత్రి శ్రీధర్ బాబు ఒక్కటే అడుగుతున్నాం మేము మండలాన్ని తీసుకొచ్చాం మీరు అభివృద్ధి చేసి చూపించండి అని డిమాండ్ చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు పూర్తి కావస్తున్న అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం వెనకబడిపోయింది.
యాక్షన్ పుల్ - అభివృద్ధి నిల్ అనే చెప్పాలి.
ఇచ్చిన హామీలను ప్రజలు మర్చిపోయేలా రేవంత్ రెడ్డి కొత్త కొత్త డ్రామాలు వేస్తూ ప్రజలకు ఎంటర్టైన్మెంట్ రాజకీయం చూపిస్తున్నారని అన్నారు.
అనంతరం గోరికొత్తపల్లి మండల కేంద్రంలో రోడ్డు పై బైఠాయించి వెంటనే ప్రజల కనీస అవసరాలు అయిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం,పోలీస్ స్టేషన్, కస్తూర్బా గాంధీ పాఠశాల,మహాత్మా జ్యోతి రావు పూలే బాల & బాలికల రెసిడెన్షియల్ స్కూల్, ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రం, ఎరువుల కొరత లేకుండా చూడాలని డిమాండు చేస్తారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post