తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ తో కలిసి వికారాబాద్ పట్టణంలో నూతనంగా నిర్మించిన ఎక్సైజ్ స్టేషన్ భవనాన్ని ప్రొహిబీషన్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి

తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ తో కలిసి వికారాబాద్ పట్టణంలో 
నూతనంగా నిర్మించిన ఎక్సైజ్ స్టేషన్ భవనాన్ని ప్రొహిబీషన్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు. 
ఈ కార్యక్రమంలో శాసన మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ దశరథ్, తదితరులు పాల్గొన్నారు
మంత్రి జూపల్లి కృష్ణారావు@వికారాబాద్
హైదరాబాద్ లోని బాలానగర్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో కల్తీ కల్లు ఘటన చోటు చేసుకోవడం బాధాకరం
ఈ ఘటనకు బాధ్యులైన ఎక్సైజ్ అధికారిని సస్పెండ్ చేశాం కల్లు దుకాణాలను సీజ్ చేయడం జరిగింది 
నిందితులను వెంటనే ఎక్సైజ్ శాఖ అధికారులు అరెస్ట్ చేసి న్యాయస్థానం ముందు హాజరుపరిచారు 
కల్తీ కల్లు ఘటనలను ఉపేక్షించేది లేదు
గతంలో కూడా ఇలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి 
వీటికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉంది 
దీన్ని అరికట్టడానికి శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది 
గౌడ సోదరుల సంక్షేమం, జీవన ఉపాధి కోసం పెద్ద ఎత్తున ఈత, తాటి చెట్లను నాటే కార్యక్రమం చేపడుతాం 
ప్రభుత్వ స్థలాల్లో, కాల్వ గట్లపై ఈత, తాటి చెట్లను నాటుతాం 
సీఎం రేవంత్ రెడ్డితో సంప్రదించి ఎక్సైజ్ శాఖకు అదనపు నిధులు కేటాయించాలని కోరతాం 
ఈత, తాటి ఉప ఉత్పత్తులైన నీరా లాంటి వాటి విక్రయాలకు ప్రోత్సాహాన్ని అందిస్తాం 
మాదక ద్రవ్యాలు జీవితానికి, సమాజానికి ప్రమాదకరం మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపుతాం త్వరలోనే రాష్ట్రస్థాయి సమీక్ష నిర్వహిస్తాం నిందితులపై కేసులు నమోదు చేసి, రిమాండ్ కు పంపి చేతులు దులుపుకోవడం ఒక్కటే సరిపోదు ఆయా కేసుల్లో పకడ్బందీగా విచారణ చేపట్టి నిందితులకు శిక్షలు పడేలా కృషి చేయాలి మాదక ద్రవ్యాల ఉత్పత్తి, సరఫరా, రవాణాపై ఎక్సైజ్, పోలీస్ అధికారులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలి అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి?, దాని వెనుక ఎవరు ఉన్నారో?, మూలాలు ఎక్కడ ఉన్నాయో?అన్వేషించాలి దాని కోసం ఎంతవరకైనా వెళ్లాలి. ఈ విషయంలో ఎక్సైజ్ శాఖ అధికారులకు ప్రభుత్వ సహకారం ఉంటుంది 
నిందితులకు శిక్షలు పడకపోవడానికి కారణం ఏమిటి? దీనికి అధికారులే బాధ్యత వహించాలి.
ఎక్సైజ్ శాఖ కేసుల్లో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదు 
వికారాబాద్ జిల్లాను పర్యాటకంగా అభివృద్ధికి కృషి చేస్తున్నాం 
అనంతగిరి ప్రాంతంలో అద్బుతమైన ప్రకృతి అటవీ సంపద ఉంది. నేచర్ వెల్ నెస్ సెంటర్ ను అద్భుతంగా తీర్చిదిద్దుతాం

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post