ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తిచేయాలని పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి

 నడికూడ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యక్రమం నందు మండల పరిధిలోని ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై అధికారులతో కలిసి పరకాల శాసనసభ్యులు  రేవూరి ప్రకాశ్ రెడ్డి  సమావేశాన్ని నిర్వహించారు. అంతకముందు ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో వన మహోత్సవంలో భాగంగా మొక్కలను నాటారు.అనంతరం గ్రామాల వారిగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పురోగతిపై అధికారులు,ఇందిరమ్మ కమిటీ కలిసి సమీక్షించారు.ఇల్లు లేని ప్రతి నిరుపేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలనే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.అర్హులైన ప్రతి పేదవారికి ప్రాధాన్యత క్రమంలో ఇందిరమ్మ ఇండ్లను దశలవారీగా మంజూరు చేస్తామని అన్నారు. మంజూరైన లబ్ధిదారులు నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసుకుంటే అదనంగా ఆ గ్రామానికి ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తామన్నారు. ఇండ్ల నిర్మాణం పూర్తి చేసుకున్న వారికి దశలవారీగా బిల్లులను కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఇస్తుందన్నారు. ప్రభుత్వం సూచించిన నిబంధన మేరకు ఇందిరమ్మ ఇండ్లను నిర్మించుకోవాలని అన్నారు.కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో పేదింటి వాడి సొంతకాల నెరవేరుతుందని, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు మహిళా సంఘాల ద్వారా రుణాలు తీసుకోవచ్చని అన్నారు

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post