ఈరోజు బుధవారం ఉదయం హైదరాబాద్ ఎర్రమంజిల్ లోని రాష్ట్ర పంచాయతీ రాజ్ ఈ ఎన్ సీ కార్యాలయంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఈ ఎన్ సీ కనకరత్నం, ఎస్ఈ చక్రవర్తి, ఈఈ వెంకటేశ్వర్లు, పలువురు డీఈ లు, ఏఈ లతో కలిసి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. సమీక్షా సమావేశంలో భూపాలపల్లి నియోజకర్గంలో పలు గ్రామాలల్లో జరుగుతున్న రోడ్ల అభివృద్ధి పనులు, పెండింగ్ పనుల పురోగతి, త్వరలో చేపట్టబోయే అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే అధికారులతో చర్చించారు. పెండింగ్ పనులను యుద్ధప్రాతిపదికన గుత్తేదారులతో నాణ్యతతో పూర్తి చేయించాలని ఎమ్మెల్యే సూచించారు. రంగాపురం - రేపాకపల్లి గ్రామాల మధ్య కొత్తగా హైలెవల్ వంతెన అవసరం ఉందని ఎమ్మెల్యే ఈ ఎన్ సీ కి సూచించారు. అందుకు అవసరమైన ప్రతిపాదనలు తయారుచేయాలని ఈఈ ని కోరారు. వెలుతుర్లపల్లి నుండి గుర్రంపేట వరకు డబుల్ రోడ్డు నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలని ఎమ్మెల్యే కోరారు.భూపాలపల్లిలో పంచాయతీ రాజ్ డివిజన్ కార్యాలయంతో పాటు రేగొండలో సబ్ డివిజన్ కార్యాలయం మంజూరు చేయాలన్నారు
పంచాయతీ రాజ్ ఈ ఎన్ సీ ఆఫీస్ లో అధికారులతో ఎమ్మెల్యే జీఎస్సార్ సమీక్షా సమావేశం
byBLN TELUGU NEWS
-
0
Post a Comment