రాజేంద్ర నగర్‌కు చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి పెయింటర్‌గా పని చేస్తున్నాడు. అతడు గత కొన్ని సంవత్సరాలుగా వీవో కంపెనీకి చెందిన ఫోన్ వాడుతున్నాడు.
సెల్ ఫోన్‌ను ప్యాంట్స్ జేబులో పెట్టుకుని రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్నాడు. ఈ నేపథ్యంలో ఫోన్ ఒక్కసారిగా హీటెక్కింది. ఆ వెంటనే పేలిపోయింది.దీంతో శ్రీనివాస్ కాలికి తీవ్ర గాయాలు అయ్యాయి. నొప్పితో గిలగిల్లాడసాగాడు. ఇది గమనించిన స్థానికులు అతడికి సాయం చేయడానికి ముందుకు వచ్చారు. వెంటనే దగ్గరలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. డాక్టర్లు అతడికి చికిత్స చేస్తున్నారు.
Post a Comment