విలాసాగర్ ఇసుక వరంగల్ మార్కెట్ తరలింపు
డంపులు చేసి ఇసుకను అమ్దు కుంటున్న వైనం
విలాసాగర్ సాక్షిగా నడుస్తున్న ఇసుక బాగోతం
పేరుకే ట్రాక్టర్లు ఆ తర్వాత లారీల్లో తరలింపు
కొరవడుతున్న సంబంధిత అధికారుల నిఘా
అధికారుల కనుసన్నల్లోనే నడుస్తున్నట్లు ఆరోపణలు
BLN తెలుగు దినపత్రిక కాటారం: జయశంకర్ భూపాల పల్లి జిల్లా కాటారం మండలంలోని విలాసాగర్ సాక్షిగా ఇసుక బాగోతం రాజ్యమేలుతున్నది. విలాసాగర్ పరిధిలోని మానేరు వాగులో ట్రాక్టర్ల పేరుతో పర్మిషన్లు తీసుకున్న కొందరు ఇను కాసురులు దాన్ని పక్క దారి మల్లించి సొమ్ము చేసుకుంటు. న్నారు. వర్షాకాలం కావడంతో రాష్ట్రం లో ఇసుక ధరలకు రెక్కలు రాగ దాన్ని అదునుగా తీసుకుంటున్న కొందరు ఇసుక స్వరర్లు రెచ్చిపోతున్నారు. ట్రాక్టర్ల పేరుతో పొద్దంతా ఇసుకను తీసుకురావడం వాటిని డంపులుగా చేసి లారీల్లో తరలించడం వారికి నిత్యప్రాయంగా మారింది. అర్ధరాత్రుళ్ళు అధికారుల కళ్ళు కప్పుతున్నారో లేక వారి దర్శకత్వ పర్యవేక్షణ ప్రాయమో దేవుడెరుగు కాని యథేచ్ఛగా అసుక మాఫియా కోరలు చాచి బుసలు కొడుతున్నది. దీంతో విలాసాగర్ సాక్షిగా ఇసుక దందా యథేచ్చగా సాగుతుండగా పట్టించుకో వాల్సిన సంబంధిత అధికార యంత్రాంగం వెలవారీ ఆమ్యామ్యాల మత్తులో ఊగుతున్నట్లుగా ఆరోపణలుత్తుతున్నాయి.
విలాసాగర్ టూ వరంగల్
నెల రోజుల నుండీ వర్షాకాల ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా నడిచే ఇసుక క్వారీలు మూతపడిన విషయం విధితమే. మార్కెట్ లో సాధారణ రోజుల్లో టన్నుకు రూ.1000 నుండీ రూ. 1200 వరకు ఉండగా వర్షాకాలం కావడంతో ప్రస్తుతం టన్నుకి రూ.1600 చొప్పున అమాంతం పెరిగింది. దీంతో మార్కెట్ లో ఇసుక ధరలకు రెక్కలు రాగా ఓవైపు మహదేవ పూర్ ప్రాంతంలో టీజీఎండిసి ఆధ్వర్యంలో నడిచే ఇసుక క్వారీల్లో ఇసుక లోడింగ్ నిలిపివేయడంతో క్వారీలు మూతప డ్డాయి. ఈ క్రమంలో ఏం చేయాలో తోచని కొందరి ఇసుకా సురుల కళ్ళు కాటారం మండలంలోని విలాసాగర్ మానేరు వాగుపై పడ్డాయి. ఇక అనుకున్నదే ఆలస్యమనుకున్న సదరు ఇసుక స్మగ్లర్లు విలాసాగర్ నుండి ట్రాక్టర్లు ద్వారా ఇసుకని తీసుకువచ్చి వారికి చెందిన రహస్య ప్రాంతాల్లో దంపులు ఏర్పాటు చేసుకున్నట్లుగా సమాచారం. ఆ ఇసుకని రాత్రికిరాత్రే లోడ్ చేసుకుని వరంగల్ మార్కెట్ కు తరలిస్తూ పెద్ద మొత్తంలో క్యాష్ చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది.
కొరవడుతున్న నిఘా
గత కొన్ని రోజులుగా విలాసాగర్ మానేరు వాగు కేంద్రంగా నడుస్తున్న అక్రమ ఇసుక రవాణా వ్యవహారాన్ని సంబంధిత అధికారులు మామూలుగా తీసుకుంటున్నట్లుగా పలువురు గుసగుసలాడుతున్నారు. అధికారుల నిఘా వైఫల్యంతోనే అక్రమ ఇసుక రవాణా జరుగుతున్నట్లు అక్కడి ప్రాంత వాసులు అభిప్రాయపడుతున్నారు. ఇసుక ట్రాక్టర్ల విషయంలో ఎలాంటి విధి విధానాలు లేకపోవడంతోనే విలాసాగర్ ఇసుక పక్కదారి పడుతుందని స్థానిక అవసరాల కోసమని ఖచ్చితమైన విధానాన్ని తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు. అధికా రుల కనుసన్నల్లోనే ఇసుక తవ్వకాలు జరిగితే ఇంకా బాగుం టుందని పలువురు సూచనలు ఇస్తున్నారు. ఈ మేరకు సంబంధిత అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
Post a Comment