కొత్తపేట గ్రామ ప్రజలందరికీ నమస్కారం తెలియజేస్తూ గత కొన్ని రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా మన ప్రభుత్వ పాఠశాల ప్రాంగణమంతా నీటితో నిండి ఉంది ఆ సమయంలో మన ప్రజల దృష్టికి ఈ యొక్క విషయాన్ని తేవడం జరిగింది మన పాఠశాలలో కొంత మొరం కావాలని అడగడం జరిగినది దానికి వెంటనే స్పందించి మేకల నవీన్ వారి సహృదయంతో దాదాపు 7500 రూపాయలతో ఒక లారీ మొరం తీసుకువచ్చి మన స్కూల్ ప్రాంగణంలో పోయించడం జరిగినది కావున వారికి మన యొక్క ప్రభుత్వ పాఠశాల యాజమాన్యం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మరియు వారి యొక్క మంచి మనసుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే మేకల నవీన్ భవిష్యత్తులో తాను అనుకున్న స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అలాగే ఇంకా మన స్కూల్ కి రెండు మూడు ట్రిప్పులు మొరం అవసరం ఉన్నది కావున గ్రామ పెద్దలు మరియు సహృదయం గలవారు దయచేసి మీ వంతు సహాయంగా మన యొక్క స్కూల్ ప్రాంగణాన్ని కాపాడుకుందాం అందరం కలిసి మెలిసి మన యొక్క స్కూల్ ని మన యొక్క పిల్లల భవిష్యత్తుని కాపాడుకుందాం అని కోరుకుంటున్నాము ఇంకా ఎవరైనా దాతలు ముందుకు వచ్చి కావలసిన మొరం పోయిస్తారని ఆశిస్తున్నాము ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ మీ పాఠశాల యాజమాన్యం
మన యొక్క ప్రభుత్వ పాఠశాల యాజమాన్యం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు
byBLN TELUGU NEWS
-
0
Post a Comment