తెలంగాణ బీజేపీలోని అసమ్మతి నేతలపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు మరోసారి హాట్ కామెంట్స్ చేశారు.బీజేపీలో ఎంత పెద్ద నాయకుడు అయినా పార్టీ సిద్ధాంతానికి, క్రమశిక్షణకు కట్టుబడి ఉండాల్సిందేనని* స్పష్టం చేశారు. పార్టీ నిబంధనలను, క్రమశిక్షణను మీరితే చర్యలు తప్పవని* హెచ్చరించారు. పార్టీ కంటే ఎవరూ ఎక్కువ కాదని, ఎవరు పార్టీ నుంచి వెళ్లిపోయినా పెద్ద నష్టమేం లేదని తేల్చి చెప్పారు.
ఒకప్పుడు భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకుడు బల్ రాజ్ మదోక్ కూడా పార్టీ నియమాలను మీరితే సస్పెండ్ చేశారనే విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలనిఅన్నారు. అయితే ఇటీవల పార్టీకి రాజీనామా చేసిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ గురించే రామచందర్ రావు పరోక్షంగా ఈ వ్యాఖ్యలు అని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది
Post a Comment