పరకాల మండల ఎరువులు పురుగు మందులు విత్తనాల డీలర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏడీఏకు ఘన సన్మానం.
పరకాల ADA పరిధి ఎరువులు పురుగు మందులు మరియు విత్తనాలు డీలర్ వెల్ఫేర్ అసోసియేషన్స్ ఆధ్వర్యం లో పరకాల ఏ డి ఏ పదవి విరమణ కార్యక్రమంను పరకాల స్వర్ణ గార్డెన్లో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి గందె వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించారు. ఇట్టి కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర రైతు రుణ విమోచన కమిషన్ మాజీ చైర్మన్ వరంగల్ జిల్లా ఫర్టిలైజర్,పెస్టిసైడ్స్అండ్ సీడ్స్ అసోసియేషన్ అధ్యక్షులు నాగుర్ల వెంకటేశ్వర్లు,వరంగల్ జెడిఎ అనురాధ వారు పాల్గొని పరకాల ఏడిఏ పదవి విరమణ పొందిన వంగ రవీందర్ గారిని పూలమాలలతో శాలువాలతో సత్కరించి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 33 సంవత్సరాలుగా వ్యవసాయ అధికారిగా రైతులకు సేవలందించి పరకాల ఏడిఏ గా పదవి విరమణ పొందినారు. వీరి సేవలు మరువలేనివని వారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమానికి వరంగల్ కరీంనగర్ భూపాలపల్లి ములుగు జిల్లాల వ్యవసాయ అధికారులు పరకాల మండల పరిధిలోని పరకాల,ఆత్మకూరు, నడికూడ, దామెర, శాయంపేట మండలాల వ్యాపారస్తులు ఏడిఏ ని పూలమాలలతో శాలువాతో ఘనంగా సన్మానించడం జరిగింది. ఏ డి ఏ రవీందర్ మాట్లాడుతూ 33 సంవత్సరాల తన సుదీర్ఘ వ్యవసాయ అధికారి ప్రయాణంలో పరకాల మండల ఎరువులు పురుగు మందులు విత్తన డీలర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆ పదవి విరమణ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించినందుకు అన్ని మండలాల అధ్యక్షులు గందె వెంకటేశ్వర్లు, అశోక్,రమేష్,రవితేజ,మల్లికార్జున్ గార్లకి , మరియు కార్యక్రమానికి హాజరైన కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అధికారులకు వ్యాపారస్తులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
Post a Comment