మరొకరేమో మనీలాండరింగ్ సహా పలు ఆర్థిక అవకతవకల ఆరోపణలతో విదేశాలకు చెక్కేశారు..!!తాజాగా, ఈ ఇద్దరూ కలిసి ఓకే పార్టీలో చిందులేశారు.ఆ ఇద్దరు ఎవరో కాదు.. విజయ్ మాల్యా, లలిత్ మోది.వీరిద్దరినీ ఇండియాకు రప్పించాలని చాలా కాలంగా ప్రయత్నాలు జరుగుతుంటే.. వీళ్లేమో సంతోషంగా ఇలా చిందులేస్తూ కనిపించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.తాజాగా వీరిద్దరూ ఓ విలాసవంతమైన పార్టీలో కలిసిన ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది.
సోషల్ మీడియాలో ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోదీ, విజయ్ మాల్యా వీడియో తెగ వైరల్ అవుతోంది. లలిత్ మోదీ ఏర్పాటు చేసిన ఈ పార్టీకి సుమారు 310 మందికి పైగా అతిథులు హాజరయ్యారు. అయితే ఈ వేడుకలో విజయ్ మాల్యాతో కలిసి లలిత్ మోదీ పాటలు పాడుతూ చిందులేశారు. ఇద్దరూ కలిసి 'ఐ డిడ్ ఇట్ మై వే'.. అనే పాటను ఆలపించారు. వీరిద్దరూ చిన్నపాటి స్టెప్పులు వేస్తుండగా.. పక్కన ప్రముఖులు కూడా వీరికి జత కలిశారు.చివరలో వెస్టిండీస్ మాజీ క్రికెటర్ క్రిస్ గేల్ వీరిద్దరితో కలిసి ఫొటోలు దిగారు. అలాగే క్రికెట్ బ్యాట్‌పై సంతకం చేసి లలిత్ మోదీకి అందించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను లలిత్ మోదీయే స్వయంగా తన సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేశారు. 'ఇంటర్నెట్‌ను ఈ వీడియో బ్రేక్ చేయదని ఆశిస్తున్నా.. ఇది వివాదాస్పదమే కానీ.. నేను చేసేది అదే'.. అని పేర్కొంటూ ఈ వీడియోను షేర్ చేశారు. అలాగే క్రిస్ గేల్ కూడా తన ఖాతాల్లో ఈ వీడియోలు, ఫొటోలను షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియోలపై ఓ వైపు విమర్శలు వెల్లువెత్తుతుంటే.. మరోవైపు వివిధ రకాలుగా చర్చించుకుంటున్నారు.
మనీలాండరింగ్ సహా పలు ఆర్థిక అవకతవకల ఆరోపణలతో లలిత్ మోదీ.. 2010 నుంచి లండన్‌లోనే ఉంటున్న విషయం తెలిసిందే.అలాగే కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ అధినేత విజయ్ మాల్యా.. ఇండియాలోని అనేక బ్యాంకులకు రూ.9వేల కోట్లకు పైగా రుణాలను ఎగ్గొట్టి లండన్‌లో తలదాచుకుంటున్నారు. వీరిద్దరినీ ఇండియాకు రప్పించేందుకు చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్న విషయం కూడా తెలిసిందే. అయితే *ఇలాంటి ఈ సమయంలో వీరిద్దరూ కలిసి ఇలా ఏమాత్రం భయం లేకుండా ఎంజాయ్ చేస్తూ కనిపించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
Post a Comment