ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యల పరిష్కారానికి ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో జరిగే పోరాట కార్యక్రమాలను విజయవంతం చేయాలని యూఎస్పీసి రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సభ్యులు నన్నెబోయిన తిరుపతి ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు.
పెద్దకోడెపాక ఉన్నత పాఠశాల ఆవరణలో యూఎస్పిసి పోరాట కార్యక్రమాల కరపత్రాన్ని ఉపాధ్యాయులతో ఆవిష్కరణ చేశారు.
ఈ సందర్భంగా తిరుపతి మాట్లాడుతూ ఆగస్టు 5న జిల్లా కేంద్రాల్లో ధర్నాలు నిర్వహిస్తామని, ఆగస్టు 23న హైదరాబాద్ లో రాష్ట్రస్థాయి మహాధర్నా నిర్వహిస్తామన్నారు.నూతన జిల్లాలకు డిఈఓ పోస్టులను, ప్రతి రెవెన్యూ డివిజన్‌కు డిప్యూటీ ఈఓ, నూతన మండలాలకు యంఈఓ పోస్టులను మంజూరు చేసి, ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీసు రూల్స్‌ను రూపొందించి, ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలన్నారు .
అర్వతలేని డీఈఓ లను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు . ఉపాధ్యాయుల పెన్షనర్ల, వివిధ రకాల బిల్లులను వెంటనే విడుదల చేయాలని, ప్రాథమిక పాఠశాలలకు 5571 పియస్ హెచ్‌యం పోస్టులను మంజూరు చేయాలని, పండిట్, పిఈటిల అప్ గ్రేడేషన్ ప్రక్రియ పూర్తి అయినందున జిఒ 2,3,9,10 లను రద్దు చేసి జిఒ 11,12 ల ప్రకారం పదోన్నతులు కల్పించాలని, ఉపాధ్యాయుల సర్దుబాటు మార్గదర్శకాలను సవరించాలని కోరారు. వివిధ జిల్లాల్లో జరిగిన పైరవీ డిప్యూటేషన్లను వెంటనే రద్దు చేయాలని, గురుకుల టైం టేబుల్ సవరించాలని, కెజిబివి, మోడల్ స్కూల్స్ టీచర్ల సమస్యలను పరిష్కరించాలని, సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మె కాలపు జీతాన్ని వెంటనే చెల్లించాలని, కే జి బి వి, యూ ఆర్ ఎస్, సమగ్ర శిక్ష, కాంట్రాక్టు ఉద్యోగులకు కనీస వేతనం అమలు చేయాలని, మోడల్ స్కూల్, గురుకుల సిబ్బందికి 010 పద్దు ద్వారా వేతనాలు చెల్లించాలని, గిరిజన సంక్షేమ, ఆశ్రమ పాఠశాలలోని పండిట్, పిఇటి పోస్టులను అప్ గ్రేడ్ చేసి వెంటనే పదోన్నతులు ఇవ్వాలని, ఉపాధ్యాయులను పర్యవేక్షణ అధికారులుగా నియమించాలనే ఉత్తర్వులను ఉపసంహారించాలని, విద్యారంగంలో ఎన్ జి ఓ జోక్యాన్ని నివరించాలని, అన్ని జిల్లాలకు శానిటేషన్ గ్రాంట్స్ విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ సమావేశంలో USPC నాయకులు చంద్రయ్య,శ్రీరామ్, రాజారాం, రజనీకాంత్,విద్యాసాగర్ ఉపాధ్యాయులు రఘు, బాలాజి, జ్యోత్స్న, కవిత, రేణుక,ప్రధానోపాధ్యాయులు సారయ్య మొదలగువారు పాల్గొన్నారు.
Post a Comment