రైతాంగ ఉద్యమాలకు ఆదర్శం కామ్రేడ్ ఓంకార్
రైతుల వ్యవసాయ రక్షణకు ఉద్యమాలే శరణ్యం
అఖిలభారత రైతు సమాఖ్య (AIKF) రాష్ట్ర గౌరవ అధ్యక్షులు వల్లెపు ఉపేందర్ రెడ్డి
ప్రభుత్వాల విధానాలతో వాస్తవ సాగుదారులైన రైతులకు ఉత్పత్తి ఖర్చులు పెరిగి పండిన పంటకు కనీస మద్దతు ధర రాక అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, వ్యవసాయాన్ని వీడి కూలీలుగా కార్మికులుగా మారుతున్నారని ఎ ఐ కె ప్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు వల్లెపు ఉపేందర్ రెడ్డి అన్నారు.
రైతుల వ్యవసాయ రక్షణకు బలమైన ఉద్యమాలే ఏకైక శరణ్యమని ఆ దిశలో రాజకీయాల కతీతంగా రైతాంగాన్ని ఐక్యపరచాలని పిలుపునిచ్చారు.
ఈరోజు అఖిలభారత రైతు సమాఖ్య (ఏఐకేఎఫ్), హనుమకొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులు మాజీ ఎమ్మెల్యే అమరజీవి కామ్రేడ్ మద్దికాయల ఓంకార్ శతజయంతి వార్షికోత్సవాల్లో భాగంగా రైతాంగ ఉద్యమాలు ఓంకార్ పాత్ర అనే అంశంపై శాయంపేట మండలం రైతు వేదికలో జిల్లా సదస్సు సమావేశం ఏఐకేఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు వక్కల కిషన్ అధ్యక్షతన జరిగింది.
దీనికి ముఖ్య అతిథిగా హాజరైన ఎ ఐ కె ప్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు వల్లెపు ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ అమరజీవి కామ్రేడ్ మద్దికాయల ఓంకార్ తన జీవితాన్ని తాడిత పీడిత ప్రజల విముక్తి కోసం త్యాగం చేశారని, దున్నేవాడికే భూమి కావాలని ఉమ్మడి వరంగల్ జిల్లాలో 1 లక్ష 67 వేల ఎకరాల భూములను పేదలకు దక్కేలా కృషి చేశారని, ఆదివాసి గిరిజనులకు 1/70, పిసా చట్టాలను, రాజ్యాంగంలోని ఆరవ షెడ్యూల్ ను తూచా తప్పకుండా అమలు చేయాలని పోడు రైతులందరికీ హక్కులు కల్పించాలని, తునికాకు గిట్టుబాటు రేట్లు ఇవ్వాలని అనేక నిర్బంధాలను తట్టుకొని భూస్వాములకు పాలకులకు వ్యతిరేకంగా పోరాడి అనేక విజయాలు సాధించిన గొప్ప వ్యక్తి అని నర్సంపేట నుంచి అసెంబ్లీకి శాసనసభ్యుడిగా ఐదు దఫాలుగా తిరుగులేని మెజారిటీతో ఎన్నికై చట్టసభలను కష్టజీవుల సమస్యల పరిష్కారానికి ప్రశ్నించే గొంతుకగా అసెంబ్లీ టైగర్ గా నిలిచాడని పేర్కొన్నారు. ఆయన త్యాగాలు ఆదర్శాల స్ఫూర్తితో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న రైతు వ్యతిరేక చట్టాలను విధానాలను నిరసిస్తూ పండించిన పంటకు కనీస మద్దతు ధర చట్టాన్ని పోడు భూములకు అటవీ హక్కులను సాధించుకునేందుకు మార్కెట్ దోపిడిని నివారించేందుకు రాజకీయాలకతీతంగా రైతాంగాన్ని ఐక్యం చేసి పోరాటాలను ఉదృతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఎన్ రెడ్డి హంసారెడ్డి. జిల్లా కమిటీ సభ్యులు మహమ్మద్ ఉస్మాన్. పెద్దిరెడ్డి మహేందర్ రెడ్డి. యువజన సంఘం జిల్లా నాయకులు కర్ర రాజిరెడ్డి. నీల రవీందర్. విద్యార్థి సంఘం రాష్ట్ర నాయకులు గడ్డం నాగార్జున. మాస్ సావిత్రి. కర్ర మనోధర. సతీష్.రాజమౌళి .రవీందర్. రాజేశ్వరరావు. మల్లారెడ్డి. ప్రభాకర్ రావు. మంద భద్రయ్య. కూనూరు వెంకటేశ్వర్లు. రాజమౌళి. సునీలు. రాజేశ్వరి. శంకరు. బాబురావు. రాజన్న. సీతారామరెడ్డి. సూర్య ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
Post a Comment