భూపాలపల్లి డిపో నుండి ప్రత్యేక టూర్ ప్యాకేజ్

 భూపాలపల్లి డిపో మేనేజర్  ఇందు  ప్రెస్ రిపోర్టర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఆగస్టు 3వ తేదీన భూపాలపల్లి డిపో నుండి విజయవాడ, రాజమండ్రి, సమర్లకోట,పిఠాపురం అన్నవరం దర్శించుకుని మళ్లీ భూపాలపల్లికి వచ్చేలా ప్రత్యేక టూర్ ప్యాకేజ్ ఏర్పాటుచేశామని తెలిపారు.
ఈ టూర్ ప్యాకేజ్ మొత్తం 3 రోజుల ప్యాకేజ్ కాగా, ఒక్కొక్క వ్యక్తికి కేవలం ₹2300 మాత్రమే చార్జ్ చేస్తామని తెలిపారు.
ఈ అవకాశాన్ని భూపాలపల్లి మరియు పరిసర ప్రజలు తప్పకుండా సద్వినియోగం చేసుకోవాలని డిపో మేనేజర్  ఇందు  కోరారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post