భూభారతి రెవెన్యూ సదస్సు భూ సమస్యల పరిష్కారం కోసమే సదస్సులు

భూ సమస్యల పరిష్కారమే ధ్యేయంగా రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు స్థానిక తహసిల్దార్ విజయలక్ష్మి అన్నారు. మండలంలో మంగళవారం లక్ష్మిపురం గ్రామాపంచాయితీ కార్యాలయంలో రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో పలువురు రైతుల నుంచి భూ సమస్యలు, పాస్ బుక్కు సమస్యలు, రీ సర్వే, ముటేషన్ కు సంబంధించిన తదితర అంశాలపై పలువురు రైతులు నుండి దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో తాసిల్దార్ విజయలక్ష్మి మాట్లాడుతూ రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యలు పరిష్కారం కోసం గ్రామాల వారీగా రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రైతులు సందేహాలను సదస్సుల ద్వారా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా రైతులకు పలు సూచనలు, సలహాలను చేసారు. డాక్యుమెంట్లు లేనివారు మరియు పూర్వం తప్పులు పడిన వాటికి సంబంధించినవి సరిచేసు కోవాలిని తెలిపారు. రైతుల నుండి స్వీకరించిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి తొందరగా పరిష్కరిస్తామన్నారు. ప్రభుత్వం చేపట్టిన రెవెన్యూ సదస్సులు ఉపయోగించుకొని పట్టాదారు, భూ సమస్యలు పరిష్కరించుకోవాలని రైతులకు సూచించారు.ఈ కార్యక్రమంలో ఎం ఆర్ ఐ అశోక్ రెడ్డి, దామోదర, వీఆర్ఏ లు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post