దామర మండల కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను అధికారులతో కలిసి పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి పరిశీలించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ...పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ ధ్యేయమని,ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు. లబ్ధిదారులకు విడుదలవారీగా రూ 5లక్షలు అందజేయడం జరుగుతుందన్నారు.ప్రభుత్వం సూచించిన నిబంధనల మేరకు ఇళ్లను నిర్మించుకోవాలని,అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రాధాన్యత క్రమంలో దశలవారీగా ఇందిరమ్మ ఇండ్లను పంపిణీ చేస్తామని అన్నారు.ఉచిత ఇసుకను పంపిణీ చేస్తామని,అలాగే ప్రభుత్వఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు మహిళా సంఘాల ద్వారా రుణాలు తీసుకోవచ్చని అన్నారు
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను పరిశీలించిన పరకాల శాసనసభ్యులు శ్రీ రేవూరి ప్రకాశ్ రెడ్డి
byBLN TELUGU NEWS
-
0
Post a Comment