-మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి..
హనుమకొండ జిల్లా పరకాల మండలంలోని మల్లక్కపేట గ్రామంలో ఉన్న సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల వసతి గృహంలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని ఏకు శ్రీవాణి హాస్టల్ గదిలో ఉరివేసుకొని బలవన్మరణం పాల్పడిన ఘటన ఎంతో కలిచివేసినదని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారు అన్నారు.శ్రీవాణి ఆత్మహత్య ప్రభుత్వ హత్యేనని మాజీ ఎమ్మెల్యే ఆరోపించారు.ఈ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన సంవత్సరంన్నర కాలంలో గురుకుల పాఠశాలలలో ఇలాంటి సంఘటనలో ఎన్నో జరిగాయన్నారు.సంఘటన తెలిసిన వెంటనే తాను అందుబాటులో లేకున్న సంబంధిత అధికారులకు ఫోన్ చేస్తే స్పందించలేదన్నారు.ఈ ఘటనకు పూర్తి భాద్యులు అధికారులదేనని అన్నారు.తెలిసి తెలియని వయసులో పిల్లలు తప్పుచేస్తే కౌన్సిలింగ్ చేసి సరిదిద్దాల్సిన బాధ్యత గురుకుల యాజమాన్యానిదని అన్నారు.కానీ ఈ గురుకుల పాఠశాలలో విద్యార్థినులను యాజమాన్యమే బెదిరింపులకు పాల్పడుతున్నారని తెలిసిందన్నారు.ఆ భయంతో చిన్నారులు ఇలాంటి ఘటనలు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
పేదపిల్లల ప్రాణాలతో ఈ ప్రభుత్వం చెలగాటం ఆడుతున్నడని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ ఘటనతో మిగతా పిల్లల తల్లితండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.శ్రీవాణి కుటుంబాన్ని అండగా ఉంటామని,ఈ ఘటనపై పూర్తి విచారణ జరిపి కారణమైన వారిని శిక్షించే వరకు ప్రభుత్వంపై న్యాయ పోరాటం చేస్తామన్నారు.
Post a Comment