4 సంవత్సరాల తరువాత తెరుచుకున్న పాఠశాల

శాయంపేట మండలంలో గత నాలుగు సంవత్సరాల నుండి మూతబడిన గొల్లపల్లి గ్రామంలో నీ ప్రాథమిక పాఠశాలను తిరిగి ప్రారంభించడం జరిగింది. ప్రభుత్వ పాఠశాల అవసరాన్ని గుర్తించి, గ్రామస్తుల అభ్యర్థన మేరకు మండల విద్యాధికారి తక్షణం స్పందించి ప్రత్యేక చొరవ చూపడం ద్వారా పాఠశాల తిరిగి తెరుచుకోవడం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సామూహిక అక్షర అభ్యాస కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా మండల విద్యాధికారి గడ్డం బిక్షపతి, ఎమ్ పి ఇ ఓ రంజిత్, ఏ ఎస్ ఓ ప్రవీణ్ కుమార్, ఆర్ ఐ రమేష్ హాజరు కావడం జరిగింది. ఈ కార్యక్రమం ను ఉద్దేశించి ఏంపిఈఓ రంజిత్ మాట్లాడుతూ ప్రభుత్వ విద్యను బతికించే ప్రయత్నం చెయ్యడం అభినందనీయం అనీ ప్రశంశించారు. విద్యే ప్రగతికి సోపానమని ఏఎస్ ఓ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. ఆర్ ఐ రమేష్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య లభిస్తుందని అందరు ప్రభుత్వ బడులకు పంపించాలని అన్నారు. మండల విద్యాధికారి గడ్డం బిక్షపతి మాట్లాడుతూ పాఠశాల నిలదొక్కుకునే విధంగా అధికారులతో మాట్లాడి సకల సౌకర్యాలు కల్పించడం జరుగుతుందని వారు అన్నారు. గ్రామస్తులకు హామీ ఇవ్వడం గ్రామస్తుల తో మాట్లాడుతూ తమ పిల్లలను తప్పక ప్రభుత్వ బడికే పంపాలని అన్నారు. అలాగే పిల్లలతో సామూహిక అక్షర అభ్యాసం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post