హనుమకొండ హంటర్ రోడ్డులోని కోడెం కన్వెన్షన్ హాల్‌లో జరిగిన వరంగల్, హనుమకొండ యువజన కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశం ఘనంగా జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా వరంగల్ పశ్చిమ శాసన సభ్యులు .నాయిని రాజేందర్ రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివసేన రెడ్డి .హాజరయ్యారు.
ఈ కార్యక్రమాన్ని వరంగల్ జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు పరమేష్ మరియు హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దిలీప్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ –
దేశానికి మార్గనిర్దేశం చేసే శక్తి యువతలో ఉంది. కాంగ్రెస్ పార్టీ సిద్దాంతాలను, ఇందిరమ్మ ఆశయాలను కొత్త తరం యువతకు పరిచయం చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. ప్రతి యువజన కాంగ్రెస్ కార్యకర్త, సోషల్ మీడియా నుంచి సర్వే బూత్ వరకు పార్టీని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించాలి, అని తెలిపారు.పార్టీని నడిపించేది అనుభవం మాత్రమే కాదు, ఉత్సాహం, నిబద్ధత కూడా. యువజన కాంగ్రెస్‌లో పని చేస్తున్న నాయకులకు రాబోయే రోజుల్లో పార్టీ ఆర్గనైజేషన్‌లో, ఎన్నికల రాజకీయాల్లో ముఖ్యమైన బాధ్యతలు ఇవ్వాలని మా సంకల్పం. స్థానిక స్థాయిలోనే కాకుండా మున్సిపల్, కార్పొరేషన్, అసెంబ్లీ స్థాయిలోనూ యువతకు ప్రాధాన్యత ఇవ్వడమే మా లక్ష్యం. మీ కృషికి తగ్గ గుర్తింపు ఖచ్చితంగా ఉంటుంది అని నాయిని హామీ ఇచ్చారు
Post a Comment