జర్నలిస్టులకు ప్రత్యేక రక్షణ చట్టాన్ని రూపొందించి అమలు చేయాలి

తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్స్ యూనియన్ (టీఎస్ జెయు) హనుమకొండ జిల్లా కమిటీ ఎన్నిక
పత్రికల ఎంప్యానల్ మెంట్ వెంటనే చేపట్టాలి
 తెలంగాణ ప్రెస్ మీడియా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి.ప్రజాస్వామ్యంలో మూల స్తంభాలలో నాలుగవ స్తంభం లాంటి జర్నలిస్టులపై దాడులు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోకపోవడంతో దాడులు పునరావృతం అవుతున్నాయని తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోకల అనిల్ కుమార్ అన్నారు. సోమవారం తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్స్ యూనియన్ హన్మకొండ జిల్లా కమిటీ ఎన్నిక జిల్లా కేంద్రంలో జరిగినది. ఈ సందర్భంగా అనిల్ కుమార్ మాట్లాడుతూ జర్నలిస్టులపై దాడుల నిరోధానికి ప్రభుత్వం ఒక ప్రత్యేకమైన చట్టాన్ని రూపొందించే అమలు చేయడం వల్ల దాడులను నివారించవచ్చునని సూచించారు. ప్రభుత్వం ఎప్పటి కప్పుడు తాత్కాలికమైన నిర్ణయాలు తీసుకోకుండా జర్నలిస్టుల సంబంధిత అవసరాలను పరిగణలోకి తీసుకొని ఒక సమగ్రమైన మీడియా పాలసీని రూపొందించి దేశానికే ఆదర్శంగా నిలవాలని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన తో పాటు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడంలో కీలక పాత్ర పోషించిన పత్రికలు, చానల్స్ సమస్యలపై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు అదే విధంగా ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న స్థానిక పత్రికల ఎం ప్యానల్ ఎంపానెల్ మెంట్ వెంటనే చేపట్టి రుణభారంతో బ్రతుకులీడుస్తున్న పాత్రికేయులను ఆదుకోవాలని అన్నారు. ఇప్పుడు ఉన్న యూనియన్లు జర్నలిస్టుల సంక్షేమం కోసం కాకుండా తమ వ్యక్తి గత ప్రయోజనాలకే పరిమితమయ్యాయని ఆయన విమర్శించారు. అలా కాకుండా తాము ఒక ప్రత్యామ్నాయ జర్నలిస్టు ఉద్యమ నిర్మాణానికి శ్రీకారం చూట్టామని అన్నారు. ఈ సందర్భంగా హన్మకొండ జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
హన్మకొండ జిల్లా కమిటీ : జిల్లా అధ్యక్షుడిగా ముత్తొజు రాము, ప్రధాన కార్యదర్శిగా దొరి హరికృష్ణ , కోశాధికారిగా గణపనేని చంద్ర శేఖర్, ఉపాధ్యక్షులుగా పబ్బు రాజ్ కుమార్, ఆర్.అరుణ్ కుమార్, సహాయ కార్యదర్శులు దాడి బిక్షపతి, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా మంద సదానందం, బెల్లంపల్లి చరణ్ ,ఈసీ మెంబర్లుగా గోక శ్రవణ్, పొన్నాల సురేష్ లు ఎన్నికయ్యారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post