జిల్లా కేంద్రంలోని ఐడిఓసి కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల వినతులను జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ స్వీకరించారు.
అనంతరం ఆయా సమస్యలపై సంబంధిత అధికారులతో చర్చించి, పరిష్కారానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 57 దరఖాస్తులు అందాయనీ, వాటి పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధతో పని చేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ప్రజలు వ్యక్తపరిచిన సమస్యలను సున్నితంగా తీసుకుని, పెండింగ్‌లో ఉంచకుండా వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే హైదరాబాద్ ప్రజాభవన్ నుండి వచ్చిన దరఖాస్తుల విషయంలో కూడా తగిన చర్యలు తీసుకొని తక్షణ నివేదికలు పంపించాలని ఆయన స్పష్టం చేశారు. ప్రజావాణిలో వచ్చిన సమస్యలపై దరఖాస్తు దారులకు సమస్య పరిష్కారానికి తీసుకున్న చర్యలను తెలియచేయాలని ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం ప్రజల సమస్యలు పరిష్కరించడమేనని కలెక్టర్ రాహుల్ శర్మ పేర్కొన్నారు.
Post a Comment