పరకాల మండలంలోని మల్లక్క పేట సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థిని శ్రీ వాణి ఆత్మహత్య చేసుకున్న సంఘటన సోమవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. విద్యార్థిని శ్రీవాణి పరకాల వాసిగా తెలుస్తోంది. ఆత్మహత్యపై పోలీసులు విచారిస్తున్నారు. అసలు గురుకులంలో ఏం జరుగుతుంది? గతంలో కొండచిలువలు గురుకులంలోకి ప్రవేశించిన విషయం తెలిసిందే.. పదేపదే గురుకులం ఏదో ఒక సంఘటనలకు కేంద్ర బిందువుగా మారుతుంది.. తక్షణమే అధికారులు స్పందించి అసలు గురుకులంలో ఏం జరుగుతుంది? యాజమాన్యం సరిగ్గా బాధ్యత తీసుకుంటుందా? ప్రత్యేక నిఘ పెట్టి ఇలాంటి పునరావితం కాకుండా చూసుకోవాలని పిల్లల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
మల్లక్కపేట గురుకుల పాఠశాలలో విద్యార్థిని ఆత్మహత్య..
byBLN TELUGU NEWS
-
0
Post a Comment