జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ విద్యా సంస్థలలో ఉచిత విద్య అందించాలి

బహుజన స్టూడెంట్స్ యూనియన్(BSU)
ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు మంద సురేష్
ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పత్రికా& ఎలక్ట్రానిక్ మీడియా పిల్లలకు ప్రైవేటు విద్యాసంస్థలలో ఉచిత విద్య అందించాలి అని నేడు ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో బహుజన స్టూడెంట్స్ యూనియన్(BSU) ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు మంద సురేష్ మాట్లాడుతూ ఎన్ని ప్రభుత్వాలు మారిన పత్రికా విలేకరులకు ఇచ్చిన హామీలు ఏ ప్రభుత్వం నెరవేర్చలేక పోతుంది సమాజంలో ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉండే పత్రికా విలేకరుల పిల్లలకు ఉచిత విద్య అందించలేకపోవడం చాలా బాధాకరం అన్నారు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పత్రిక అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పిల్లలకు ప్రైవేటు విద్యాసంస్థలలో ఉచిత విద్య ఆoదించాలి అని ప్రత్యేకమైన జీవో ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post