BLN తెలుగు దినపత్రిక: 3 నుంచి 5 సంవత్సరాలలోపు పి ల్లలందరినీ తల్లిదండ్రులు దగ్గరలోని అంగన్వాడీ కేంద్రంలో చే ర్పించాలని హనుమకొండజిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. మంగళవారం జిల్లా సంక్షేమ శాఖ అధికారి జయంతి అధ్యక్షతన 49వ డివిజన్ జులైవాడ అంగన్వాడి కేంద్రంలో నిర్వహించిన అమ్మ మాట అంగన్వాడి బాట ముగింపు కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ హాజరయ్యారు. అంగన్వాడి సెంటర్ కి పిల్లల్ని పంపిం చినట్లయితే వారిలో శారీరక పెరుగుదలతో పాటు మానసిక, సామాజిక, మేధో అభివృద్ధి కూడా జరుగుతుందన్నారు. అం గన్వాడీ టీచర్స్ చిత్తశుద్ధితో న్యూ కరికులమ్ ప్రకారం ఫాలో అవుతూ పిల్లలని అంగన్వాడీ కేంద్రం పూర్వ ప్రాథమిక పాఠశా లలో చేర్పించుకోవాల్సిందిగా ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి కె. జయంతి మాట్లాడుతూ ఉదయం 9. గంటలకే అన్ని అంగన్వాడీ కేంద్రాలలో బెల్ మోగించి ప్రీస్కూల్ కార్యక్రమాలని న్యూ టైం టేబుల్, సిలబస్ ద్వారా నిర్వహిస్తూ ఫ్రీస్కూల్ నమోదు, హాజరు ను పెంచి, పిల్లలని సాయంత్రం నాలుగు గంటల వరకు అంగన్వాడీ సెంటర్లోనే ఉంచవలసింది గా కోరారు. ఆరోగ్యలక్ష్మి ద్వారా అందించే ఒక పూట సంపూర్ణ భోజనాన్ని గర్భిణీలు, బాలింతలు అంగన్వాడీ కేంద్రాలలోనే తినేలాగా సూచించారు. అనంతరం 49వ డివిజన్ కార్పొరే టర్ ఏనుగుల మానస రాంప్రసాద్ మాట్లాడారు. 30 మంది మూడేళ్లు నిండిన పిల్లలకి జిల్లా కలెక్టర్, 49వ డివిజన్ కార్పొరేట ర్ ఏనుగుల మానాన రాంప్రసాద్ సామూహిక అక్షరాభ్యాసాలు చేయించారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ ప్రాజెక్ట్ హనుమ కొండ సిడిపిఓ ఎం.విశ్వజ, సూపర్వైజర్ వి.రాజలక్ష్మి, ఎం.జ్యో తి, పోషణ అభియాన్ కోఆర్డినేటర్ డి. ప్రీతి, డిహెచ్ ఈడబ్ల్యూకో ఆర్డినేటర్ డి. కళ్యాణి అండ్ స్టాప్, సఖి అడ్మిన్ హైమాపతి అండ్ స్టాఫ్. అంగన్వాడీ టీచర్లు ఎం,ప్రసన్న, రమాతార, అంగన్వాడి హెల్పర్లు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, అంగన్వాడి లబ్దిదారులు
ఐదేళ్లలోపు చిన్నారులను అంగన్వాడీకేంద్రాలలో చేర్పించాలి. హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్
byBLN TELUGU NEWS
-
0
Post a Comment