చిన్నపిల్లలు ఉండాల్సింది బడిలో కానీ పనిలో కాదని సీనియర్ సివిల్ జడ్జి మరియు న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఏ. నాగరాజు అన్నారు. ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. భూపాలపల్లి పట్టణంలోని స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరిగిన ఈ కార్యక్రమంలో జడ్జి పాల్గొన్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ చిన్నపిల్లలను పనిలో పెట్టుకుంటే ఉపేక్షించేది లేదని పేర్కొన్నారు. చిన్న పిల్లలు ప్రశ్నించడం అలవాటు చేసుకోవాలన్నారు. కష్టపడి చదివి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అన్నారు. ఐక్య రాజ్య సమితి తీసుకున్నటువంటి ఈ నిర్ణయంతో యావత్తు ప్రపంచం బాల కార్మిక నిర్మూలన కోసం కదులుతుందని తెలిపారు. బాలకార్మిక నిర్మూలన కోసం ప్రతీ ఒక్కరు కలిసికట్టుగా నడవాలని వారు అన్నారు. పాఠశాల ఆవరణంలో జడ్జి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి . దిలీప్ కుమార్ నాయక్ , అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి జి. అఖిల, అడ్వొకేట్స్ బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వి. శ్రావణ్ రావు , లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్ కే. అక్షయ , సీనియర్ న్యాయవాదులు పగడాల ఆనందరావు , ఎం.డి. రఫీక్ , ప్రధానోపాధ్యాయులు లక్ష్మి ప్రసన్న , సరోత్తం రెడ్డి , శ్రీనివాస్ , స్వచ్చంద సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.
పిల్లలు పనిలో కాదు బడిలో ఉండాలి సీనియర్ సివిల్ జడ్జి మరియు న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఏ. నాగరాజు
byBLN TELUGU NEWS
-
0
Post a Comment