హనుమకొండ జిల్లా పరిధిలోని వివిధ మండలాల గ్రామాల ఎరువులు పురుగుమందుల విత్తనముల డీలర్లలతో సమీక్ష సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ ప్రావిణ్య. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... వర్షాకాలం రబీ పంటలు ఆసన్నమవుతున్న వేళ రైతులను ఉద్దేశిస్తూ వారి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని హనుమకొండ జిల్లా పరిధిలోని పలు ఫర్టిలైజర్ పెస్టిసైడ్స్ సీడ్స్ యజమానులతో హనుమకొండ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో భాగంగా వారు మాట్లాడుతూ రైతులకు నాణ్యమైన విత్తనాలను ఎరువులను అందించాలని నాణ్యత ప్రమాణాలు కలిగిన ఎరువులను విత్తనాలను ఖచ్చితమైన బిల్లులతో నాణ్యత ప్రమాణాలతో కూడిన కంపెనీలను మాత్రమే క్రయవిక్రయాలు జరుపుతూ ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరలకు అమ్మకుండా వ్యవసాయ అధికారుల పర్యవేక్షణలో
పి ఓ ఎస్ మిషిన్ల ఆధారంగా డీలర్ల వద్ద గల ఎరువులను ఆధార్ కార్డు వేలు ముద్ర ఆధారంగా ఓటీపీ ద్వారా ఎరువులను కొనుగోలు చేయాలని నాసిరకం విత్తనాలు అమ్మిన వారిపై కఠినమైన చర్యలు తప్పవని తెలంగాణ ప్రభుత్వ ఆదేశానుసారం వ్యవసాయ అధికారులకు సహకరిస్తూ తమ వ్యాపారాలు నిర్వహించుకోవాలని స్టాక్ బోర్డులు స్టాక్ రిపోర్టులను ఎప్పటికప్పుడు అధికారులు పరిశీలించాలని కోరారు. ఈ సందర్భంగా పరకాల పట్టణానికి చెందిన అరుణ ఫర్టిలైజర్ ప్రముఖ ఫర్టిలైజర్ షాప్ యజమాని గందె వెంకటేశ్వర్ల కు కలెక్టర్ చేతుల మీదుగా పిఓఎస్ మిషన్ అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జెడిఏ రవీంద్ర నాయక్ హనుమకొండ ఏసిపి పరకాల ఏసీపీ జిల్లా వ్యవసాయ అధికారులు ఏ ఈ ఓ లు జిల్లాలోని ఫర్టిలైజర్ షాప్ యజమానులు పలువురు పాల్గొనడం జరిగింది.
Post a Comment