జై బాపు జై భీం జై సంవిధాన్ నినాదాన్ని ప్రజలలోకి తీసుకెళ్ళాలి

నేరేడుపల్లి/అప్పయ్యపల్లి/
ప్రగతి సింగారం:జై బాపు, జై భీం, జై సంవిధాన్ నినాదాన్ని ప్రజలలోకి విస్తృతంగా తీసుకెళ్ళాలని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి నాయకులకు సూచించారు. స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఆదేశాల మేరకు మండలంలోని నేరేడుపల్లి అప్పయ్య పల్లి ప్రగతి సింగారం గ్రామాలలో కాంగ్రెస్ నాయకులతో కలిసి జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా బుధవారం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బుచ్చిరెడ్డి మాట్లాడుతూ.. పార్లమెంట్ సాక్షిగా కేంద్ర మంత్రి అమిత్ షా రాజ్యాంగాన్ని మార్చాలని అనడం బీ జే పీ పతనానికి నాంది అని అభివర్ణించారు. రాజ్యంగంతోనే బడుగు బలహీన వర్గాలకు అన్ని రంగాలలో న్యాయం జరుగుతుందని అన్నారు. కేంద్రం రిజర్వేషన్లు ఎత్తివేసే కుట్ర చేస్తుందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో కార్యక్రమ ఇంచార్జ్ ప్రణయ్ దీప్ కాంగ్రెస్ నాయకులు చల్లా చక్రపాణి పోలపల్లి శ్రీనివాస్ రెడ్డి మారెపల్లి రవీందర్ రఘుపతి రెడ్డి ఆది రెడ్డి కృష్ణమూర్తి చిందం రవి నిమ్మల రమేష్ హైదర్ సమ్మిరెడ్డి భాస్కర్ రాజు క్రాంతి కుమార్ (కటయ్య) వీరన్న తదితరులు పాల్గొన్నారు._

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post