గీసుగొండ మండలం కొమ్మాల శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి దర్శించుకుని, ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం ఆలయ పూజారులు సాంప్రదాయ పద్ధతులతో పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. కొమ్మాల శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం సన్నిధిలో ప్రతి శనివారం నిర్వహించనున్న మహా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అన్నిశాఖల అధికారులు,సిబ్బంది, ప్రజాప్రతినిధుల సమన్వయంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా ప్రశాంత వాతావరణంలో జాతర జరుపుకున్నామని,కొమ్మాల జాతర అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు.అనంతరం జాతర విజయవంతం చేసిన సందర్భంగా అధికారులు, ప్రజా ప్రతినిధులను ఎమ్మెల్యే అభినందనలు తెలిపి, శాలువాతో ఘనంగా సన్మానించారు
కొమ్మాల శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం సన్నిధిలో అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి
byBLN TELUGU NEWS
-
0
Post a Comment