సెమీస్ కు ముందు టీమిండియాకు బిగ్ షాక్..స్వదేశానికి వచ్చేసిన కీలక మెంబర్

ఛాంపియన్స్ ట్రోఫీ - 2025 హోరాహోరీగా జరుగుతున్న సంగతి తెలిసిందే. పాకిస్థాన్జ లో జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీలో సంచలనాలు నమోదు అవుతున్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహిస్తున్న పాకిస్థాన్ సెమీస్కు చేరకుండానే ఇంటి దారి పట్టింది. మరో వైపు ఇంగ్లాండ్ వంటి పటిష్టమైన జట్టును ఓడించి ఆఫ్ఘనిస్తాన్ సంచలనం సృష్టించింది. ఇక టోర్నమెంట్లో ఒక్క మ్యాచ్ కూడా గెలవకుండానే ఇంగ్లీష్ టీం తమ పోరాటాన్ని ముగించింది.ఇండియాతో పాటు, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్ జట్లు సెమీ ఫైనల్కు చేరుకున్నాయి. టీమిండియాతో ఆస్ట్రేలియా తలపడుతుండగా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్ జట్లు పోటీ పడనున్నాయి.మంగళవారం టీమిండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య తొలి సెమీ ఫైనల్ జరగనుండగా, బుధవారం సౌతాఫ్రికా, న్యూజిలాండ్ జట్ల మధ్య రెండో సెమీ ఫైనల్ జరగనుంది. గెలిచిన జట్లు ఫైనల్లో తలపడనున్నాయి.ఆస్ట్రేలియాపై టీమిండియా గెలిస్తే ఫైనల్ మ్యాచ్ దుబాయ్లో జరుగుతుంది.ఒకవేళ ఈ మ్యాచ్లో భారత జట్టు ఓడిపోతే ఫైనల్ మ్యాచ్ పాకిస్థాన్లో నిర్వహించనున్నారు. ఇదిలా ఉంటే సెమీ ఫైనల్కు ముందు టీమిండియాకు బ్యాడ్ న్యూస్ అందింది. భారత క్రికెట్ జట్టు మేనేజర్ ఆర్.దేవరాజ్ ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి మధ్యలోనే తప్పుకున్నారు. ఆదివారం ఆయన తల్లి కమలేశ్వరి మరణించడంతో దేవరాజ్ జట్టును వీడి హైదరాబాద్కు వచ్చేశారు. తల్లి అంత్యక్రియల్లో దేవరాజ్ పాల్గొనడానికి దేవరాజ్ ఛాంపియన్స్ ట్రోఫీ మధ్యలోనే స్వదేశానికి వచ్చేశారు.దేవరాజ్ ప్రస్తుతం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) కార్యదర్శిగా కొనసాగుతున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఆయన దుబాయ్ కు వెళ్లిడం జరిగింది

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post