BLN తెలుగు దినపత్రిక
గత రెండు సంవత్సరాలు మిస్టరీగా మిగిలిపోయిన కేసును చేధించి నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచన పరకాల ఏసిపి సతీష్బాబుతో పాటు శాయంపేట సర్కిల్ ఇన్సెస్పెక్టర్ రంజిత్లను వరంగల్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అభినందిస్తూ నగదు పురస్కారాలను అందజేశారు. వివరాల్లోకి వెళితే రెండు సంవత్సరాల క్రితం పరకాల పోలీస్ స్టేషన్ పరిధిలోని ధర్మారం గ్రామ శివారులో జరిగిన ఓ వృద్ధురాలి హత్యకేసులో నిందితులు పట్టుకోవడంలో ఎలాంటి క్లూస్ పరకాల పోలీసులకు లభించకపోవడంతో పాటు పరకాల పోలీస్ స్టేషన్ పలువురు ఇన్స్పెక్టర్లు పలుమార్లు బదిలీ కావడంతో ఈ కేసు ఓ మిస్టరీగా నిలిచిపోవడం జరిగింది. వరంగల్ పోలీస్ కమిషనర్ అదేశాల మేరకు ఈ కేసు దర్యాప్తును శాయంపేట సర్కిల్ ఇన్స్ స్పెక్టర్ రంజిత్ అప్పంగించడం జరిగింది. దీనితో పరకాల ఏసిపి పర్యవేక్షణలో ఈ హత్య కేసు దర్యాప్తు చేపట్టిన రంజిత్ కొద్ది రోజుల్లోనే హత్యకు గురైంది శాయంపేట మండలం ఆరెపల్లి గ్రామస్తురాలిగా గుర్తించడంతో పాటు బంగారు అభరణాల కోసం అదే గ్రామానికి చెందిన ఇంటి రాజిరెడ్డి హత్య గురైన వృద్ధురాలిని తీసుకవెళ్ళి ధర్మారం గ్రామ శివారులో దారుణంగా హత్య చేసినట్లుగా సర్కిల్ ఇన్స్ స్పెక్టర్ దర్యాప్తులో బయటపటడంతో వృద్ధురాలని హత్య చేసిన రాజిరెడ్డిని గత నెలలో పరకాల పోలీసులు అరెస్టు చేసిన రిమాండ్ తరలించారు. ఎంతో కాలంగా పెండింగ్లో వుంది పోలీసులకు ఓ సవాలుగా నిలిచిన ఈ హత్యకేసును ఛేదించడంలో ప్రతిభ కనపరిచిన పోలీస్ అధికారులకు వరంగల్ పోలీస్ కమిషనర్ నగదు పురస్కారాలను అందజేసారు. ఈ కార్యక్రమములో డిసిపి రవీందర్ పాల్గోన్నారు.
Post a Comment