BLN తెలుగు దినపత్రిక హనుమకొండ: జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయ సమావేశ మందిరంలో పట్టణ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు, పల్లె దవఖానా, బస్తీ దవఖానా వైద్యాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గత నెల 8న జిల్లా కలెక్టర్ నిర్వహించిన సమావేశం నుంచి ఈ రోజు వరకు నెల రోజులలో సాధించిన ప్రగతిని పీహెచ్సీల వారీగా డీఎంహెచ డాక్టర్ ఏ. అప్పయ్య సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని జాతీయ ఆరోగ్య కార్యక్రమాలలో నిర్దేశించిన లక్ష్యాలను 100 శాతం సాధించాలని ఆదేశించారు. ప్రోగ్రాంల వారీగా ఉప కేంద్రాల వారీగా ఎక్కడైతే వెనుక బడి ఉన్నారో అందుకు కారణాలను తెలుసుకొని ఏఎన్ఎంలు ఆశాల వారీగా సమీక్షలు నిర్వహించాలన్నారు. అందరూ వైద్యాధికారులు, సిబ్బంది సమయపాలన పాటించాలన్నారు. ఆరోగ్య మహిళా క్లినిక్ లలో ప్రతి రోజు కనీసం 50 మంది మహిళలకు పరీక్షలు నిర్వహించాలని, టీబీ తెమడ పరీక్షలు ఎక్కువగా నిర్వహించాలన్నారు. రిపోర్టింగ్ విధానాన్ని మరింత మెరుగుపరచాలన్నారు. మాతా, శిశు సంక్షేమ కార్యక్రమంలో భాగంగా 100శాతం గర్భిణీలను 12 వారాలలోపే గుర్తించి నమోదు చేయాలని, అనిమియాను త్వరితగతిన గుర్తించి పూర్తి స్థాయి చికిత్సను అందచేయాలన్నారు. పల్లె దవఖానా వైద్యాధికారులు పీహెచ్సీ వైద్యాధికారులతో సమన్వయంతో పని చేయాలని, ఓపీ తరువాత వైద్యాధికారులు ఉప కేంద్రాలలో పని తీరును పర్యవేక్షించాలన్నారుప్రతి రిపోర్టులను ఎప్పటికప్పుడు ఆన్ లైన్ లో అప్ లోడ్ చేయాలని, ఈ ఔషధి పోర్టర్ లో మందుల వివరాలను ప్రతి రోజు నమోదు చేయాలన్నారు. బేటీ బచావో బేటీ పడవో కార్యక్రమంలో భాగంగా పీహెచ్సీల వారీగా లింగ నిష్పత్తి రేటు సమీక్షించడం జరిగింది. లింగ నిర్ధారణ, అబార్షన్ ల గురించి 104, 1098, 181, డయల్ 100 టోల్ ఫ్రీ నెంబర్ లకు సమాచారం అందించాలన్నారు. అనంతరం అందరితో ప్రతిజ్ఞ చేయించారు. జాతీయ నులి పురుగుల నిర్మూలన కార్యక్రమంపై వైద్యాధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ నెల 10న నిర్వహించవలసిన ఈ కార్యక్రమం తాత్కాలింగా వాయిదా వేయబడిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీఎంహెచ్ఎ డాక్టర్ మదన్ మోహన్ రావు, జిల్లా క్షయ నియంత్రణ అధికారి డాక్టర్ హిమ బిందు, ఎన్ సీడీ ప్రోగ్రాం అధికారి డాక్టర్ ఇస్లాదర్ అహ్మద్, డాక్టర్ మంజుల, జిల్లా మాస్ మీడియా అధికారి వి.అశోక్ రెడ్డి, ఎసీ ప్రసన్న కుమార్, ప్రవీణ్, పట్టణ, ప్రాథమిక, పల్లె దవఖానా వైద్యాధికారులు పాల్గొన్నారు.
నిర్ధేశించిన లక్ష్యాలను వంద శాతం సాధించాలి డి ఎం హెచ్ ఓ డాక్టర్ అప్పయ్య
byBLN TELUGU NEWS
-
0
Post a Comment