శాయంపేటలో బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ అవగాహన ర్యాలీ, సభ

BLN తెలుగు దినపత్రిక :

కాంగ్రెస్ కలిసి పాల్గొన్న ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు..
- రాష్ట్రంలో కులగణన అత్యంత పారదర్శకంగా జరిగింది..
- స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీలకు..
- గ్రామాలల్లో కలిసికట్టుగా కష్టపడి ఎక్కువ స్థానాల్లో గెలుపొందాలని సూచన..
- కులగణన సర్వేను మళ్లీ చేయాలనడం విడ్డూరంగా ఉంది..
శాయంపేటలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు భూపాలపల్లి నియోజకవర్గం శాయంపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ మండల కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ అవగాహన ర్యాలీ & సభకు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు హాజరయ్యారు. ముందుగా ఎమ్మెల్యేకు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, అభిమానులు స్వాగతం పలికారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి నుండి స్థానిక అంబేద్కర్ సెంటర్ వరకు భారీ ర్యాలీగా చేరుకున్నారు. అంబేద్కర్ సెంటర్ లో ఏర్పాటు చేసిన సీఎం రేవంత్ రెడ్డి ప్లెక్సీ కి ఎమ్మెల్యే పాలాభిషేకం చేశారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రంలో కులగణన సర్వే అత్యంత పారదర్శకంగా జరిగిందన్నారు. కులగణన సర్వేను మళ్లీ చేయాలన్న కేటీఆర్ వ్యాఖ్యలను యావత్ బీసీ సమాజం అస్సలు క్షమించదని ఎమ్మెల్యే అన్నారు. పదేళ్ల క్రితం సమగ్ర కుటుంబ సర్వే చేసి కనీసం ఆ లెక్కలను కూడా సమాజానికి చెప్పలేని, ఇప్పుడు కేటీఆర్ కులగణన సర్వేను మళ్లీ చేయాలని మాట్లాడటం విడ్డూరంగా ఉన్నదని ఎమ్మెల్యే అన్నారు. ప్రజా ప్రభుత్వం ఏర్పాటైన ఏడాది కాలంలోనే ప్రభుత్వానికి ప్రజల్లో మంచి పేరు వస్తుంటే చూసి భరించలేకే కేటీఆర్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారని ఎమ్మెల్యే ఆరోపించారు. ఎంతో శాస్త్రీయంగా ప్రభుత్వ సిబ్బందితో ఇంటింటికి తిప్పి పరిశీలించి మరీ వివరాలు సేకరించినట్లు తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారాస - బీజేపీ లోపాయికారి ఒప్పందాలను చేసుకునన్నారని ఎమ్మెల్యే ఆరోపించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ లకు 42 శాతం రిజర్వేషన్లను ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్నట్లు ఎమ్మెల్యే గండ్ర తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సాధ్యమైనంత మేరకు ఎక్కువ స్థానాలు ఏకగ్రీవం అయ్యేలా కృషి చేయాలని నేతలకు ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. పార్టీ శ్రేణులు గ్రామాలలో కలిసికట్టుగా పనిచేయాలని, వర్గాలుగా విడిపోయి గ్రామాలల్లో ఇబ్బందికర పరిస్థితులను సృష్టిస్తే ఊరుకునేది లేదని అన్నారు

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post