తెలంగాణలో బీసీల సంఖ్యను తక్కువ చేసి చూపించారని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్

కామారెడ్డి బీసీ డిక్లరేషన్ చూసి సంతోషించాం కానీ సర్వే చూసి బాధపడ్డామన్నారుప్రభుత్వ వెబ్ సైట్లలో తెలంగాణ జనాభా 4 కోట్లుగా ఉంటే 38 లక్షల మందిని తక్కువ చేసి చూపించారని విమర్శించారు. ఈ తతంగమంతా బీసీలను మోసం చేసేందుకే అని చెప్పారు. కులగణనచేసి చేతులు దులుపుకుంటామంటే ఎలా? హిందూ బీసీలు,ముస్లీం బీసీలు ఉంటారా అని ప్రశ్నించారు పాయల్ శంకర్. మాటిచ్చాం..తొందపడ్తాం అంటే ఎలా అని అన్నారు. ఈ కులగణనతో బీసీలకు న్యాయం జరుగుతుందా? అని ప్రశ్నించారు.స్థానిక సంస్థల ఎన్నికలు ఆరు నెలలు లేటైనా పర్వాలేదు కానీ.. కులగణన పగడ్భందీగా చేయాలనిచెప్పారు. జనాభాలో 60 శాతం జనాభా ఉన్న బీసీలకు రాజకీయ న్యాయం ఎక్కడా అని ప్రశ్నించారు. వెనుబడిన వర్గాలకు గెలవలేని సీట్లు ఇస్తారు. అన్ని రాజకీయ పార్టీలు ఓడిపోయే సీట్లే బీసీలకు ఇస్తాయి. రాహుల్ గాంధీ మాటలకు తెలంగాణ ప్రభుత్వ తీరుకు పొంతన లేదు. బీసీలకు అన్యాయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రత్యేక రాష్ట్రంలో బీసీ బిడ్డలకు అన్యాయం జరుగుతుంది. తెలంగాణ పోరాటంలో ముందుంది బీసీ బిడ్డలే. బడ్జెట్లో బీసీలకు 3 వేల కోట్లు కేటాయించి 15 కోట్లు ఖర్చు చేశారు. ఒక బీసీని ప్రధానిని చేసిన చరిత్ర బీజేపీది. కులవృత్తులను ఆదుకుంటామని అన్నోళ్లంతా దొంగలే. కులవృత్తులను నమ్ముకున్నాం కాబట్టే ఇంకా ఎదగలేకపోయాం.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post