సీఎం రేవంత్ రెడ్డి అన్నారు42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడానికి బీఆర్ఎస్, బీజేపీ కూడా సిద్దమా ? అని సవాల్ విసిరారు కులగణన సర్వేపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా మాట్లాడిన రేవంత్.. 2011 నుంచి తెలంగాణలో అధికారిక జనాభా లెక్కలు లేవన్నారు.బీజేపీ సభ్యుడు పాయల్ శంకర్ అపోహల సంఘం అధ్యక్షుల లెక్కలు చెబుతున్నారని విమర్శించారు. అపోహల సంఘం లెక్కలు కూడా తప్పుగానే ఉన్నాయన్నారుపాయల్ శంకర్ సమగ్ర కుటుంబ సర్వే రిపోర్ట్ ను బట్టి అసెంబ్లీలో మాట్లాడుతున్నారని చెప్పారు రేవంత్ కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు, పద్మారావు, పల్లా రాజేశ్వర్ రెడ్డి, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, డీకే అరుణ లాంటి వాళ్లు కులగణన సర్వేలో పాల్గొనలేదన్నారు రేవంత్. భూమి వివరాల కాలం ఉంది కాబట్టే సర్వేలో పాల్గొనలేదన్నారు.ఇల్లిల్లు తిరిగి సేకరించిన డేటాను తప్పు అంటే ఎలా? అని ప్రశ్నించారు రేవంత్. ప్రతిపక్షాలు ఓ డాక్యుమెంట్స్ ను సర్క్యులేట్ చేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పారు రేవంత్. సర్క్యులేట్ అవుతున్న డాక్యుమెంట్ లోనూ తప్పుడు లెక్కలే ఉన్నాయన్నారు. వాస్తవాలను సభ ముందు ఉంచితే విమర్శిస్తున్నారని తెలిపారు. ఈ డాక్యుమెంట్ అఫిషియలా కాదా ఆనాటి మంత్రులు చెప్పాలని ప్రశ్నించారు కులగణన ప్రకారం తెలంగాణ జనాభా మూడుకోట్ల 70 లక్షలకు పైగా ఉందన్నారుమా కులగణన నివేదిక వందకు వంద శాతం పారదర్శకమన్నారు రేవంత్. మోదీ ప్రదాని అయిన తర్వాత జనగణన చేయలేదన్నారు రేవంత్ జనాభా లెక్కలు చేయడం మోదీకి ఇష్టం లేదన్నారు. 2021లో చేయాల్సిన జనాభా లెక్కలు 2025 వచ్చినా మొదలు పెట్టలేదన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం.. 3.కోట్ల 54 లక్షలుగా ఉంటే.. కులగణన లెక్కల ప్రకారం తెలంగాణ జనాభా 3కోట్ల 70 లక్షలకు పైగా ఉందన్నారు రేవంత్.
స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు
byBLN TELUGU NEWS
-
0
Post a Comment